Breaking News

పశ్చిమ లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి వెలంపల్లి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో శుక్రవారం నాడు మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు స్థానిక 47వ డివిజన్ లో గల అర్బన్ హెల్త్ సెంటర్ నందు ప్రారంభించారు.ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ క్షేత్రస్థాయిలో వారి వారి మౌలిక వసతుల రీత్యా సేవ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించిందన్నారు ఈ సందర్భంలోనే జగనన్న సురక్ష కార్యక్రమాన్నికి కొనసాగింపుగా ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమం ద్వారా ప్రతి పేదవాడి ఆరోగ్య సంరక్షణ దేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.ఈ కార్యక్రమం నేటి నుండి ప్రతి ఇంటికి ఆయా వాలంటీర్ ఆయా గృహసారథులు వెళ్లి ప్రతి ఇంటిలో ఆరోగ్యపరమైనటువంటి వైద్య పరీక్షలు చేసి తద్వారా వైద్యులతో మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండి పుణ్యశిల,స్థానిక కార్పొరేటర్ గోదావరి గంగా నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ వివిధ డివిజన్ల కార్పొరేటర్లు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్లు పార్టీ నాయకులూ కార్యకర్తలు అభిమానులు మరియు వైద్య శాఖ అధికారులు,నగర పాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *