Breaking News

రంగస్థల కళాకారులు గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

-అక్టోబర్ 8వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి: జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని రంగస్థలకళాకారులు గుర్తింపు కార్డుల కోసం అక్టోబర్ 7వ తేదీ లోపల తమ దరఖాస్తులను సమర్పించాలని గతంలో తెలిపిన తేదీని ఈ నెల 8 వరకు పొడిగించడం ఐనదని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఎ. బాల కొండయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని రంగస్థలకళాకారులు గుర్తింపు కార్డుల కొరకు వివరాలను పంపాల్సిందిగా సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ వారి నుండి ఉత్తర్వులు అందాయన్నారు.

రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ వారి ఆదేశాల మేరకు.. అర్హులైన రంగస్థల కళాకారులు కొత్త గుర్తింపు కార్డులను పొందుటకు కమిషనర్ వారు సూచించిన ప్రొఫార్మా ప్రకారం 1) కలకారుని పేరు 2) జెండర్ 3) బ్లడ్ గ్రూపు 4) తండ్రి పేరు 5) పుట్టిన తేదీ 6) చిరునామా 7) జిల్లా 8) కళా రూపం 9) అనుభవం (సం౹౹లు) 10)మొబైల్ నెంబర్ 11) ఆధార్ నెంబర్ 12) ఇ-మెయిల్ అడ్రస్ మొదలైన వివరాలను తెలుపుతూ.. సంబంధిత ఆధారాల నకలు ప్రతులను జతచేసి సంబంధిత తాసిల్దార్ ధృవీకరణతో తమ దరఖాస్తులను నిర్దేశిత ప్రోఫార్మాలో అక్టోబర్ 8వ తేదీ సాయంత్రం 5గం౹౹ లోపు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం – A- బ్లాక్, 4వ అంతస్తు,జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, పద్మావతి నిలయం, తిరుపతి నందు సమర్పించాలని ఆయన ఆ ప్రకటనలో తెలియజేశారు. ఇతర సందేహాల నివృత్తి కొరకు ఈ కార్యాలయపు అధికారి ఎవిఎస్ పుల్లయ్య 8897604650 నంబర్ ను సంప్రదించగలరు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *