Breaking News

నవంబర్ ఒకటవ తేదీ బుధవారం ఉదయం నుండే కార్డుదారులకు నిత్యవసర సరుకులు పంపిణీ.,… జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కార్డుదారులకు సరఫరా చేసే నిత్యవసర సరుకులు పంపిణీ నవంబర్ ఒకటో తేదీ బుధవారం ఉదయం 7 గంటల నుండి ప్రారంభించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్ తెలిపారు.

మొబైల్ డిస్పర్సింగ్ యూనిట్ ( ఎండియు)
ఆపరేటర్లు బుధవారం నుండి ప్రతిరోజు ఉదయం 7 గంటలకు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం,బియ్యం,పంచదార వంటి నిత్యవసర సరుకులను నవంబర్ ఒకటో తేదీ బుధవారం నుండి 17 తేదీ వరకు కార్డుదారుల ఇంటి వద్దనే పంపిణీ చేసేలా ఆదేశించామన్నారు. విటమిన్ ఏ, పోలిక్ యాసిడ్, విటమిన్ బి12, ఐరన్ కలిపిన పోషక విలువలతో కూడిన బియ్యాన్ని పంపిణీ చేయుచున్నందున కార్డుదారులు ఆ బియ్యాన్ని వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వీటితోపాటు పట్టణంలోని కార్డుదారులకు పోషక విలువలతో కూడిన చిక్కి గోధుమ పిండిని కేజీ 16 రూపాయలకే ఇవ్వడం జరుగుతుందన్నారు జిల్లాలోని కార్డుదారులు ప్రభుత్వం సరఫరా చేసే పోషక విలువల పోర్ట ఫైడ్ బియ్యం గోధుమ పిండిలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలోని కార్డుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. చౌక ధరదుకాణాల డీలర్లు ఎండియు ఆపరేటర్ల ద్వారా బుధవారం ఉదయం నుండి సరుకుల పంపిణీ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నిత్యవసర సరుకుల పంపిణీలో ఫిర్యాదులు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1967 కు ఫోన్ చేయవచ్చునని జాయింట్ కలెక్టర్ పి. సంపత్ కుమార్ ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *