Breaking News

ఉద్యోగంలో నైపుణ్యం పెంపొందించుకోవాలి.

-జిల్లా ఉపాధి కల్పన అధికారి విక్టర్ బాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ – జిల్లా ఉపాధి కల్పన శాఖ మరియు నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు ఉద్యోగ మేళా నిర్వహించినట్లు ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి విక్టర్ బాబు అన్నారు. మంగళవారం నాడు విజయవాడ లోని ప్రభుత్వ ఐ.టి.ఐ కళాశాల నందు గల ఉపాధి కల్పన కార్యాలయం నందు మినీ జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగంలో నైపుణ్యం పెంపొందించుకావాలని ఎంపికైన ఉద్యోగం లో మరింత నైపుణ్యాన్ని ప్రదర్శించి ఉన్నత మార్గాలను అన్వేషించాలి అని కోరారు.తక్కువ వేతనాలు అని ఆలోచనా చేయకుండా తొలి ఉద్యోగం జీవితానికి తొలి మెట్టుగా భావించాలని అని అన్నారు.అదే విధంగా నిరుద్యోగుల కు ఉద్యోగాలు కల్పించేందుకు అనేక కంపెనీల ప్రతినిధులు పాల్గొనడం హర్షణీయం అని అన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ప్రాంతీయ నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు మాట్లాడుతూ మీ పై ఎన్నో ఆశలు పెట్టుకొని చదివించిన తల్లిదండ్రులకు ఎంతో కష్టపడి మీరు చదివిన చదువుకు తగిన జాబ్ లభించినప్పుడే తల్లిదండ్రులకు మరింత గౌరవం, తృప్తి కలుగుతుందని పేర్కొన్నారు. చదువు పూర్తయిన అనంతరం ఉద్యోగాల కోసం కంపెనీల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఇటువంటి జాబ్ మేళాలు నిర్వహించి పలు సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించేలా ఉపాధి కల్పన శాఖ మరియు స్కిల్ డెవలప్మెంట్ శాఖ కృషి చేస్తుందని తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో యాక్సిస్ బ్యాంక్,రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, అపోలో ఫార్మసీ, వరుణ్ మోటార్స్,స్విచ్ గేర్స్ ఫ్యాబ్రికేటర్స్ తదితర కంపెనీల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూ లు నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో మొత్తం 163 మంది అభ్యర్థులు హాజరుకాగా వారిలో 45 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని విక్టర్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో యంగ్ ప్రొఫెషనల్ జయ రాజు మరియు కంపెనీ ప్రతినిధులు అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *