Breaking News

అన‌ధికార ఎల్లో ఫీవ‌ర్ వ్యాక్సినేష‌న్ వేస్తే క‌ఠిన చ‌ర్య‌లు

-జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్‌టీఆర్ జిల్లాలో అన‌ధికార ఎల్లో ఫీవ‌ర్ వ్యాక్సినేష‌న్ వేస్తే ఆయా ఆసుప‌త్రుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు హెచ్చ‌రించారు. ఈ మేర‌కు ఆయ‌న మంగ‌ళ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. విదేశాల‌కు ప్ర‌యాణించేవారికి ఎల్లో ఫీవ‌ర్ వ్యాక్సినేష‌న్ ధ్రువీక‌ర‌ణ‌ప‌త్రం విమానాశ్ర‌యంలో అవ‌స‌ర‌మైనందున.. ఎన్‌టీఆర్ జిల్లాలో ప్ర‌భుత్వ జనరల్ ఆసుప‌త్రి, సిద్దార్థ మెడిక‌ల్ కాలేజీ వ‌ద్ద మాత్ర‌మే వ్యాక్సినేష‌న్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక్క‌డ పొందిన ధ్రువీక‌ర‌ణ‌ప‌త్రం మాత్ర‌మే విమానాశ్ర‌యాల్లో చెల్లుబాట‌వుతుంద‌న్నారు. ఇటీవ‌ల ప్ర‌భుత్వ గుర్తింపు లేకుండా అన‌ధికారికంగా వ్యాక్సినేష‌న్ చేసి, ధ్రువీక‌ర‌ణ‌ప‌త్రం అందించిన విజ‌య‌వాడ‌లోని ఓ ప్రైవేటు ల్యాబ్‌ను సీజ్ చేసిన‌ట్లు వెల్ల‌డించారు. అనుమ‌తులు లేకుండా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించే సంస్థ‌లు, వ్య‌క్తుల‌పై చ‌ట్టం ప్ర‌కారం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. అదేవిధంగా అన్ని స్థాయిల్లోని ప్రైవేటు ఆసుప‌త్రులు, క్లినిక‌ల్ ల్యాబ్‌లు త‌ప్ప‌నిస‌రిగా క్లినిక‌ల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చ‌ట్టం ప‌రిధిలో రిజిస్ట‌రయి ఉండాల‌ని.. లేదంటే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని క‌లెక్ట‌ర్ డిల్లీరావు పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *