Breaking News

సంక్షేమ పథకాల అమల్లో రుణాల మంజూరు అత్యంత కీలకం

-ఈ విషయంలో మున్ముందు కూడా సహకరించాలి.
-ఎస్ ఎల్ బి సి నూతన కన్వీనర్ రవీంద్రబాబుతో కలెక్టర్ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలుగా అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాల విజయవంతానికి రుణాల మంజూరు అత్యంత కీలకమని.. ఈ విషయంలో సహకరించాలని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు.. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్.ఎల్.బి.సి) నూతన కన్వీనర్ ఎం.రవీంద్రబాబును కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి నూతన కన్వీనర్ ఎం.రవీంద్రబాబు మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ డిల్లీరావును మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను బహూకరించారు. ఈ సందర్భంగా ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో కీలకపాత్ర పోషిస్తున్న రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టడం ఆనందకరమంటూ రవీంద్రబాబుకు కలెక్టర్ డిల్లీరావు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో వివిధ సంక్షేమ పథకాలు, వివిధ వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాల అమల్లో బ్యాంకు లింకేజీ ద్వారా రుణాల మంజూరు అనేది చాలా ముఖ్యమని ఈ విషయంలో లీడ్ బ్యాంకు కార్యాలయాల ద్వారా రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి విశేషంగా కృషిచేస్తోందని.. భవిష్యత్తులోనూ ఇదేవిధంగా రుణాల మంజూరుకు సహకరించాలని కోరారు. కలెక్టర్ ను కలిసిన వారిలో యూబీఐ రీజనల్ హెడ్ మువ్వా శ్రీధర్, ఎల్ డి ఎం కె. ప్రియాంక, ఏఫ్జీఎంవో చీఫ్ మేనేజర్ జయశ్యామ్ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *