Breaking News

డా. బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హం, స్మృతివ‌నం ప‌నుల‌ను ప‌రిశీలించిన‌ క‌లెక్ట‌ర్ డిల్లీరావు

– ప‌నుల స‌త్వ‌ర పూర్తికి మార్గ‌నిర్దేశం చేసిన క‌లెక్ట‌ర్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజ‌య‌వాడ స్వ‌రాజ్య మైదానంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిత‌మ‌వుతున్న 125 అడుగుల ఎత్త‌యిన డా. బీఆర్ అంబేద్కర్ విగ్ర‌హం, స్మృతివ‌నం నిర్మాణ ప‌నుల‌ను మంగ‌ళ‌వారం సాయంత్రం క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు ప‌రిశీలించారు. ప‌నుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తిచేసి.. ప్రారంభోత్స‌వానికి సిద్ధం చేసేందుకు వివిధ శాఖ‌ల అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. డా. బీఆర్ అంబేద్కర్ విగ్ర‌హం, స్మృతివ‌నం ప‌నులు చివ‌రిద‌శ‌కు చేరుకున్నందున మిగిలియున్న ప‌నుల స‌త్వ‌ర పూర్తికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను సూచించారు. డిజైన్ల‌కు అనుగుణంగా శ‌ర‌వేగంగా సాగుతున్న ప‌నుల‌ను ప‌రిశీలించి.. ఎలాంటి పొర‌పాట్ల‌కు తావులేకుండా విజ‌య‌వంతంగా ప‌నులు పూర్తిచేసేందుకు ఆదేశాలిచ్చారు. ల్యాండ్ స్కేప్‌, ఫుట్‌పాత్, పార్కింగ్ ఏరియా త‌దిత‌రాల ప‌నుల‌ను ప‌రిశీలించారు. ప్రాంగ‌ణం హ‌రిత‌మ‌యం సంత‌రించుకునేందుకు వీలుగా చేయాల్సిన ఏర్పాట్ల‌పై సంబంధిత అధికారుల‌కు సూచ‌న‌లిచ్చారు. క‌లెక్ట‌ర్ వెంట విజ‌య‌వాడ‌ మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్‌, వివిధ శాఖ‌ల అధికారులు త‌దిత‌రులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *