-ముఖ్య అతిధిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరు..
-కార్యక్రమం విజయవంతం చేసేలా ఏర్పాట్లు పూర్తి చేయండి.
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 11వ తేది స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరు కానున్న దృష్ట్యా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న అబుల్ కలాం జయంతి ఉత్సవాలను గురువారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్, మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సబ్ కలెక్టర్ అదితి సింగ్‌లు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 11న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నహాలు చేయడం జరిగిందన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే ఉత్సవాలకు దాదాపు 5 నుండి 6 వేల మంది ముస్లీమ్ మైనార్టీ వర్గాలు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ప్రధాన వేదిక నిర్మాణంతో పాటు కార్యక్రమానికి హాజరు కానున్న రాష్ట్ర ఉన్నత అధికారులు, రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పోరేషన్ చైర్మన్లు ఆశీనులయ్యేందుకు తగిన ఏర్పాట్లు చేపట్టి పూర్తి చేయాలన్నారు. కార్యక్రమానికి పొల్గొనేందుకు విచ్చేసే వారికి వాహనాల పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు. అబుల్ కలాం జయంతిని పురస్కరించుకుని విశిష్ట ప్రతిష్టాకనపరిచిన వారిలో ఎంపిక చేసిన ఒకరికి జాతీయ పురస్కారంతో పాటు 8 మందికి అబుల్ కలాం లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు, 78 ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు, 78 మందికి ఉత్తమ విద్యార్థి అవార్డులు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదగా అందజేయడం జరుగుతుందన్నారు. జాబితా ప్రకారం అవార్డిలు స్వీకరించే వారికి ముందుగానే సమాచారం అందించి వారికి కేటాయించిన స్థానాల్లో ఆశీనులు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆహుతులను అలరించేలా సాంసృతి కార్యక్రమాల ప్రదర్శనలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో విచ్చేసే వారికి తగిన విధంగా సీటింగ్ ఏర్పాట్లతో పాటు త్రాగునీరు సౌకర్యం కల్పించాలన్నారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేపట్టాలని పోలీస్ అధికారులకు జిల్లా కలెక్టర్ డిల్లీరావు సూచించారు.
ఏర్పాట్ల పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్, సబ్ కలెక్టర్ అదితి సింగ్, ఉర్ధూ అకాడమి డైరెక్టర్ షేక్ మస్తాన్ వలి, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి షాషిఉన్నీసాబేగం, ట్రాన్స్‌కో ఇఇ సుధాకర్, పోలీస్ అధికారులు ఉన్నారు.
Prajavartha Online Telugu News