Breaking News

తిరునక్షత్ర వేడుకలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సీతానగరం చిన్న జీయర్ స్వామి ఆశ్రమం ( జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ) నందు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి తిరునక్షత్ర వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.. 12. 11. 2023 నుండి 16 11 2023 వరకు జరుగు ఈ తిరునక్షత్ర వేడుకలలో భాగంగా ఈ రోజు ఉదయం నాలుగు గంటలకు శ్రీ చిన్న జీయర్ స్వామి వారికి మంగళహారతి, ఆశ్రమ ప్రాంగణంలో నరకాసుర దహనం, అనంతరం వేద విద్యార్థులకు వస్త్రాలను అందించారు, తదుపరి కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి వారి చేతులమీదుగా తీర్థ గోష్టి ఎంతో వైభవంగా జరిగినది.. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు నాలుగు గంటలపాటు తీర్థ గోష్టి జరిగినది, అనంతరం వేలాది మంది భక్తులకు అన్నప్రసాదాలు అన్నప్రసాదాలు అందించడం జరిగినది.. వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలతో, పెద్దల యొక్క అనుగ్రహ భాషణంతో ఉదయం కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగినది . అనంతరం శ్రీ స్వామి వారు విజయ కీలాద్రి దివ్య క్షేత్రం పైకి విచ్చేసి ఆ శ్రీనివాసుని సేవించుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా, జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీమన్ గోకరాజు గంగరాజు లైలా దంపతులు, మై హోమ్ గ్రూప్స్ అధినేత శ్రీమన్ రామేశ్వరరావు సతీమణి కుమారి, మహా సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమాన్ జూపల్లి రంజిత్ రావు, శ్రీమాన్ ముక్కామల అప్పారావు గారు, విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు గారు, క్రేన్ వక్కపలుకుల అధినేత శ్రీమాన్ గ్రంధి కాంతారావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, MLA శ్రీమాన్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు,మరియు వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ గోష్టి స్వీకరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *