Breaking News

నిరంతర సాధనకు పుస్తక పఠనం అవసరం…

-జీవన వికాసానికి సామాజిక పురోగతికి గ్రంథాలయాలు సోపానాలు..
-గ్రంథాలయ ఉద్యమ స్పూర్తితో పుస్తక పఠనాని పాటిస్తానని ప్రతిజ్ఞ చేద్దాం.
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల జీవన వికాసానికి సమాజిక పురోగతికి గ్రంథాలయాలు సోపానాలుగా నిలుస్తున్నాయని గ్రంథాలయ విశిష్ఠతను నేటి తరానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం చేసేలా ప్రతిజ్ఞ చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
56వ జాతీయ గ్రంథాల వారోత్సవ సందర్భంగా స్థానిక ఠాగూర్‌ స్మారక జిల్లా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయ వారోత్సవాలను మంగళవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు జ్యోతి ప్రజ్వాలన చేసి ప్రారంభించారు. జవహర్‌లాల్‌ నెహ్రు, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, అయ్యంకి వెంకటరమణయ్య చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ భారత దేశ గ్రంథాలయ ఉద్యమ పితామహుడు ఎస్‌ ఆర్‌ రంగనాథన్‌ సేవలకు గుర్తుగా ఆయన జన్మదినం రోజున జాతీయ గ్రంథాలయ దినోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆధునిక దేవాలయాలైన గ్రంథాలయాల అవశ్యకతను నేటి తరానికి తెలియచేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రంథాలయాల అవసరాలను గుర్తించి స్వాతంత్య్రానికి పూర్వమే మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున గ్రంథాలయోద్యమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలను విజ్ఞానవంతులను చేయడంతో పాటు స్వాతంత్రోద్యమ స్పూర్తిని నింపెందుకు గ్రంథాలయాలను ముఖ్య భూమిక పోషించిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ`బుక్స్‌, ఆడియో బుక్స్‌ వంటివి ప్రజలకు అందుబాటులోకి రావడంతో ప్రతి ఒక్కరూ కంప్యూటర్‌, మొబైల్స్‌, ల్యాప్‌టాప్‌ వంటి ఆధునాతన పరికరాల ద్వారా కావాల్సిన సమాచారాన్ని పొందగలుగుతున్నప్పటికి గ్రంథాల ద్వారా అందే సమాచారానికి మించినది లేదన్నారు. పుస్తక పఠనం మేదో వికాసానికి దోహదపడుతుందన్నారు. కంప్యూటర్‌ పఠనం ద్వారా నేత్రాలు త్వరగా దెబ్బతినే అవకాశం ఉంటుందన్నారు. పుస్తక పఠనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. కంప్యూటర్‌ చూస్తున్నప్పుడు నేత్రాలను తదేకంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉటుందని, పుస్తకం చదువుతున్నప్పుడు సహజంగా కనురెప్పలు కదులాడుతుంటాయని తద్వారా నేత్రాలు ఆరోగ్యంగా ఉంటాయన్నారు. పుస్తక పఠనం ద్వారా పొందే విజ్ఞానం, సమాచారం ఎల్లపుడు గుర్తు ఉండిపోతుందన్నారు. పుస్తక పఠనం నిరంతర అధ్యాయనం వంటిందని, గ్రంథాలయ అవశ్యకతను నేటి తరానికి చాటిచెప్పెందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా విద్యార్థులు పోటీ పరీక్షలను ఎదుర్కోనేందుకు ఉపయోగపడే పుస్తకాలను గ్రంథాలయాలలో అందుబాటులో ఉంచి విద్యార్థులను గ్రంథాలయాల వైపు ఆకర్షించేలా కృషి చేయాలని సూచించారు. గ్రంథాలయ ఉద్యంలో ప్రముఖ పాత్ర పోషించిన డా. యస్‌ ఆర్‌ రంగనాధన్‌, పాతూరు నాగభూషణం, అయ్యంకి వెంకట రమణయ్యల స్పూర్తితో పుస్తక పఠనాన్ని పాటిస్తానని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.
గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ తిప్పరమల్లి జమలాపూర్ణమ్మ మాట్లాడుతూ 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రంధాలయాలలో ఈనెల 14వ తేది నుండి 20వ తేది వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తునట్లు తెలిపారు. 14వ తేదిన వారోత్సవాని ప్రారంభించి బాలల దినోత్సవాని నిర్వహిస్తున్నామన్నారు. 15వ తేది పుస్తక ప్రదర్శనలు నిర్వహించి మాదక ద్రవ్యాల దుష్పలితాలపై అవగాహన కల్పించి పుస్తక పఠనా ప్రాముఖ్యతను వివరించనున్నామన్నారు. 16వ తేది గ్రంథాలయ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన ఉద్యమ కారులను స్మరించుకోవడం జరుగుతుందన్నారు. 17వ తేది కవి సమ్మేళనాల, సెమినార్లు నిర్వహించనున్నామని,18వ తేది విద్యార్థులకు చిత్రలేఖనం వ్యక్తృత్వ క్విజ్‌ మరియు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామన్నారు. 19వ తేది మహిళా సాధికారత దిశ చట్టం గురించి మహిళాలకు అవగాహన కల్పిస్తామన్నారు. 20వ తేది విద్యార్థులచే సామూహిక పఠన కార్యక్రమం, డిజిటల్‌ గ్రంథాలయాలపై అవగాహన కల్పించి ముగింపు కార్యక్రమంలో బహుమతులను అందజేయనున్నామని ఆమె తెలిపారు.
కార్యక్రమంలో ప్రముఖ సాహితి వ్యక్త జి.వి. పూర్ణచందు, స్థానిక కార్పొరేటర్‌ నెలిబండ్ల బాలస్వామి, గ్రంథాలయ కార్యదర్శి నగేష్‌, గ్రంథపాలకులు కె. రమదేవి, జి. ఉమారాణి, వై. ధనలక్ష్మి, సిబ్బంది కె. రాంబాబు, జె. శంకర్‌, ఇజియస్‌ వి. కుమార్‌, పి.వి.వి. ఫణిబాబు పలువురు పాఠకులు వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *