Breaking News

జ‌గ‌న‌న్న విద్యా దీవెన ల‌బ్ధికి ఈ నెల 24లోగా జాయింట్ ఖాతా తెర‌వాలి

-జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జ‌గ‌న‌న్న విద్యా దీవెన నాలుగో విడ‌త ద్వారా ల‌బ్ధి పొందేందుకు ఈ నెల 24వ తేదీలోగా విద్యార్థి, త‌ల్లితో కొత్త జాయింట్ బ్యాంక్ అకౌంట్ తెర‌వాల‌ని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు మంగ‌ళ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. 2022-23లో ఫైన‌లియ‌ర్ పూర్త‌యిన ఏ కేట‌గిరీ విద్యార్థులైనా, ఎస్‌సీ విద్యార్థులు మిన‌హా మిగిలిన వారు త‌ప్ప‌నిస‌రిగా జాయింట్ అకౌంట్ తెర‌వాల్సి ఉంటుంద‌న్నారు. విద్యార్థి ప్రైమ‌రీ అకౌంట్ హోల్డ‌ర్‌గా, త‌ల్లి సెకండ‌రీ అకౌంట్ హోల్డ‌ర్‌గా ఉండాల‌ని.. ఒక‌వేళ త‌ల్లి మ‌ర‌ణిస్తే తండ్రి/సంర‌క్ష‌కుడు సెకండ‌రీ అకౌంట్ హోల్డ‌ర్‌గా ఉండాల‌ని సూచించారు. కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే అంద‌రూ క‌లిసి ఒకే బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయొచ్చ‌ని.. అయితే ఏ విద్యార్థి అయితే ఇంకా ఎక్కువ సంవ‌త్స‌రాలు చ‌ద‌వాల్సి ఉంటుందో ఆ విద్యార్థిని ప్రైమ‌రీ హోల్డ‌ర్‌గా పెట్టాల్సి ఉంటుంద‌న్నారు. రాష్ట్రంలోని ఏ బ్యాంకులోనైనా జాయింట్ ఖాతా తెర‌వవ‌చ్చ‌ని.. ఏటీఎం, నెట్ బ్యాంకింగ్ వంటి సేవ‌లు ఉండ‌కూడ‌ద‌ని.. ఒక‌వేళ ఇప్ప‌టికే ఉంటే వాటిని డీయాక్టివేట్ చేసుకోవాల‌ని సూచించారు. చెక్‌బుక్ ఉండొచ్చ‌న్నారు. జాయింట్ అకౌంట్ తీసుకునేందుకు సంబంధించి అన్ని బ్యాంకుల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు పంపిన‌ట్లు తెలిపారు. జాయింట్ అకౌంట్‌కి ఆధార్ సీడింగ్ అవ‌స‌రం లేద‌ని.. ఈ అకౌంట్ ఉన్న‌వారికి ఈ నెల 28న జ‌గ‌న‌న్న విద్యా దీవెన నిధులు విడుద‌ల చేయ‌డం జ‌రుగుతుంద‌ని కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *