Breaking News

కులం మతం ప్రాంతం చూడకుండా అభివృధి చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దే : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో ప్రతి ఇంటికీ, ప్రతి పౌరుడికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా చేకూర్చిన మేలును వివరిస్తూ రూపొందించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం “ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలి” ( వై ఏపీ నీడ్స్ జగన్) కార్యక్రమం అని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 15వ డివిజన్,68వ సచివాలయంల పరిధి మరియు 11వ డివిజన్,05వ సచివాలయం పరిధిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని సచివాలయ పరిధిలో సంక్షేమ పథకాల ద్వారా చేకూరిన లబ్ధిని వివరిస్తూ అమర్చిన డిస్ ప్లై బోర్డుని ఆవిష్కరించి, అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి గత ప్రభుత్వ వైఫల్యాలను నాలుగున్నర సంవత్సరంలో జగనన్న ప్రభుత్వం చేకూర్చిన మేలుని అవినాష్ వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ, ఈ నాలుగున్నర ఏళ్లలో పరిపాలనా సంస్కర­ణలు, వినూత్న కార్యక్రమాల ద్వారా దేశమంతా ప్రశంసించేలా మన రాష్ట్రం సాధించిన పురోభివృద్ధిని అందరికీ క్షుణ్ణంగా తెలియ­జెప్పేలా అలాగే గత తెలుగుదేశం ప్రభుత్వానికి – వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని చాటి చెప్పేందుకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమానికి రూపకల్పన చేశారని తెలిపారు.జగనన్న పాలనలో జరిగిన మంచిని ప్రజలకు చెప్పేందుకు.. 2019లో ఇచ్చిన హామీలను 99 శాతం నెరవేర్చిన విషయాన్ని మేనిఫెస్టో చూపిస్తూ వివరించి,మళ్లీ జగనన్నని సీఎంగా చేసుకోవాలని చెప్పే అద్భుతమైన కార్యక్రమమే వై ఏపీ నీడ్స్‌ జగన్‌ అని అవినాష్ పేర్కొన్నారు. గతంలో ఈ 15వ డివిజన్ ను దత్తత తీసుకున్న అని ప్రగల్భాలు పలికిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సవతి ప్రేమ చూపించి అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేసారని విమర్శించారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ డివిజన్ లో 6465 మందికి 21 కోట్ల మేర సంక్షేమ లబ్ది అందించడమే కాకుండా 12కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని,అదేవిధంగా 11వ డివిజన్ లో 1500 మందికి 9 కోట్ల రూపాయల సంక్షేమ లబ్ది అందజేయడం జరిగిందని అన్నారు. పొద్దున్న లేస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి మిగతా తోక పేపర్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విషం చిమ్ముతున్నాయి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా ఉన్న చంద్రబాబు నాయుడు నాడు ఇవ్వలేని భవిష్యత్తు గ్యారెంటీ ఇప్పుడు ఎలా ఇస్తారు అని ప్రశ్నించారు. మాట ఇచ్చి మోసం చేయడమే చంద్రబాబు గ్యారెంటీ అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో 15వ డివిజన్ కార్పొరేటర్,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,11వ డివిజన్ వైసీపీ ఇంచార్జ్ పర్వతనేని పవన్ కుమార్,మండల ఇంచార్జ్ రిజ్వాన్, క్లస్టర్ ఇంచార్జ్ గద్దె కళ్యాణ్,సాయి కృష్ణారెడ్డి,రామకృష్ణ మరియు వైసీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *