Breaking News

పునాది దశ నుంచి సరైన విద్యను అందించాలి

-సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులను భవిష్యత్తులో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలంటే వారికి పునాది దశ నుంచే సరైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా కృషి చేయాలని సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఆంధ్రా లయోలా కాలేజీ ప్రాంగణం ఎస్-జే ఎక్స్ లెన్స్ సెంటర్ లో ‘రాష్ట్ర సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలో 9-10 తరగతులకు నిర్మాణాత్మక బోధనాశాస్త్రంలో పాఠ్య ప్రణాళికల తయారీ’ అంశంపై జరిగిన వర్క్ షాపునకు ఎస్పీడీ  బి.శ్రీనివాసరావు  ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎస్పీడీ  మాట్లాడుతూ… సీబీఎస్ఈ పద్ధతిలో పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యేలా పాఠ్య ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. కంటెంట్ తో పాటు యాక్టివిటీస్, హైపర్ లింకులు, వీడియోలను పొందుపరచాలని సూచించారు. ఉపాధ్యాయులు సులభంగా ఉపయోగించుకునేలా పాఠ్య ప్రణాళికలను డిజిటల్ విధానంలో రూపకల్పన చేయాలని అన్నారు. విషయనిపుణులు రూపొందించిన పాఠ్య ప్రణాళికలు పరిశీలించారు. తర్వలో ఐఐటీ, ఐఎస్ఈఆర్ (తిరుపతి) వారితో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు.

గ్రేడ్ 1,2 విద్యార్థులకు ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యుమరసీ) సమర్థవంతంగా అమలు చేయాలని, ఉపాధ్యాయులు తమ బాధ్యతను సొంతం చేసుకోవాలన్నారు. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెళ్లు, పాఠశాల గ్రంథాలయాలు, ప్రయోగశాలలు సద్వినియోగపరచుకునేలా విద్యార్థులను అలవాటు చేయాలని కోరారు.

ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమాలను రెసిడెన్షియల్ విధానంలో దశలవారీగా నిర్వహించాలన్నారు. శిక్షణలో ఉపాధ్యాయుల అభ్యసనా సామర్థ్యాలు పరీక్షించడమే కాకుండా, నైతిక విలువలతో కూడిన శిక్షణ ఇవ్వాలన్నారు.

కార్యక్రమంలో CRISP (Centre for Research in Schemes and Policies టీమ్ స్టేట్ లీడ్ ఉషా కుమారి, సీబీఎస్ఈ జాయింట్ డైరెక్టర్ ఎం.వి.కృష్ణారెడ్డి, అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్శిటీ నుండి ప్రొఫెసర్లు పూజ (ఇంగ్లీష్), అనుపమ (గణితం), నందన్ (సామాజిక శాస్త్రం), ఎల్ఎఫ్ఈ, శామో, ఎస్సీఈఆర్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. పాఠ్య ప్రణాళిక రూపకల్పనలో సహకారమందించిన క్రిస్ప్, అజీమ్ ప్రేమ్ యూనివర్శిటీ బృందాలకు కృతజ్ఞతలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *