Breaking News

జిల్లాలో 19,489 గృహా నిర్మాణాలను పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్దం చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జవవరి 30 నాటికి జిల్లాలో 19,489 గృహా నిర్మాణాలను పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
గృహ నిర్మాణాలు,ఆడుదాం ఆంధ్రా, తుది ఓటర్ల జాబితా, ప్రాధాన్యత భవన నిర్మాణాలు తదితర అంశాలపై బుధవారం కలెక్టరేట్‌ నుండి డివిజనల్‌ ఆఫీసర్లు, మున్సిపల్‌ కమీషనర్లు, స్పెషల్‌ ఆఫీసర్లు, తహాశీల్థార్లు, ఎంపిడివోలు, సంబంధిత శాఖల ఇంజనీరింగ్‌ అధికారులతో జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ నవరత్నాలు పేదలందరికి ఇళ్లులో భాగంగా జగనన్న లేఅవుట్లలో నిర్మాణాలు జరుపుకుంటున్న గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జవవరి 30 నాటికి జిల్లాలో 19,489 గృహా నిర్మాణాలను పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్దం చేయాలనే లక్ష్యాలకు అనుగుణంగా వారంవారిగా నిర్మాణాలలో ప్రగతి చూపాలన్నారు. నిర్మాణాలను పరిశీలిస్తే మైలవరం నియోజకవర్గంలో 3,955, తిరువూరు నియోజకవర్గంలో 481, జగ్గయ్యపేట నియోజకవర్గంలో 1,169, నందిగామ నియోజకవన్గంలో 1,756, నిర్మాణాలతో పాటు నగరపాలక సంస్థ పరిధిలోని విజయవాడ తూర్పు 2,663, విజయవాడ సెంట్రల్‌ 5,453, విజయవాడ పశ్చిమ 4,012 నియోజకవర్గాలోని నిర్మాణాల లక్ష్యాలను పూర్తి చేసి సిద్దం చేయాలన్నారు. ముఖ్యంగా రూప్‌ లెవల్‌ స్థాయి నుండి రూప్‌ క్యాస్టింగ్‌ దశలలో ఉన్న నిర్మాణాలు పూర్తి చేసేలా కార్యచరణ ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. లేఅవుట్లలో రహదారులు, విద్యుత్‌, నీరు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను ఇప్పటికే పూర్తి చేయడం జరిగిందన్నారు. నిర్మాణాలకు అవసరమైన ఇసుక, సిమ్మెంట్‌, ఇటుక, ఐరన్‌ వంటి మెటిరియల్‌ను అందించడం జరిగిందన్నారు. నిర్మాణ కాంక్ట్రాక్టర్లతోను, స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని నిర్మాణ వేగం పెంచాలన్నారు. మండల పరిధిలోని గ్రామ సచివాలయాల వారిగా నిర్మాణాలను విభజించుకుని పనుల ప్రగతిని వేగవంతం చేయాలని కలెక్టర్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, క్లయిమ్స్‌ ధరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించండి…
ప్రత్యేక్ష సంక్షిప్త సవరణ`2024లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల నాటి నుండి నమోదు అవుతున్న అభ్యంతరాలు, క్లయిమ్స్‌లకు ఎప్పటికప్పడు పరిష్కారం చూపాలన్నారు. ధరఖాస్తులను బిఎల్‌వోలు, క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించి
నిర్థారించాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువ ఓటర్ల నమోదుపై సంబంధిత ఏఇఆర్‌వోలు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల పరిధిలోని కళాశాలలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థి ఓటరుగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఇందుకు ఆయా కళాశాలలో ఓటర్‌ నమోదుకై అవగాహన కల్పించే స్వీప్‌ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. డిసెంబర్‌ 2,3 శని ఆదివారాలలో నిర్వహించే స్పెషల్‌ క్యాంపెన్‌ రోజులలో పోలింగ్‌ స్టేషన్‌లలో ఓటర్‌ జాబితాతో సిద్దంగా ఉండి అభ్యంతరాలు, క్లయిమ్స్‌ స్వీకరించి డిసెంబర్‌ 26వ తేది లోపు పెండిరగ్‌ లేకుండా అన్ని ధరఖాస్తులకు పరిష్కారం చూపి 2024 జనవరి 1 నాటికి ఎన్నిక సంఘానికి ఓటర్ల జాబితా అందించేలా సిద్దం చేయాలని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.
ఆడుదాం ఆంధ్రాలో క్రీడాకారుల రిజిస్ట్రేషన్‌ వేగవంతం చేయండి…కలెక్టర్‌
డిసెంబర్‌ 15వ తేది నుండి ఫిబ్రవరి 3వ తేది వరకు నిర్వహించే ఆడుదాం ఆంధ్రాలో క్రీడాకారుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సచివాలయ స్థాయిలో వేగవంతం చేయాలన్నారు. ఐదు విభాగాలలో నిర్వహించే ఈ క్రీడలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి ప్రతీ క్రీడాకారునికి పాతినిద్యం కల్పించాలన్నారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన ఈనెల 27వ తేది సోమవారం నుండి డిసెంబర్‌ 13వ తేది వరకు నిర్వహించే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో నేటి వరకు జిల్లాలో 10 వేల వరకు రిజిస్ట్రేషన్‌ జరిగాయన్నారు. ప్రక్రియలో వెనుకబడి ఉన్న మైలవరం, ఇబ్రహింపట్నం, పెనుగ్రంచిప్రోలు, జగ్గయ్యపేట, చందర్లపాడు, కంచికచర్లలో డబుల్‌ డిజిట్‌ రిజిస్ట్రేషన్‌ జరిగినట్లు గుర్తించామని, ప్రక్రియను మరింత వేగవతం చేసి రిజిస్ట్రేషన్‌ లో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని కలెక్టర్‌ డిల్లీరావు అధికారులను కోరారు.
జగనన్నకు చెబుదాం (స్పందన) ఆర్జీలకు పరిష్కారం చూపండి… కలెక్టర్‌
ప్రతి సోమవారం నిర్వహించే జగనన్నకు చెబుదాం (స్పందన) లో నమోదు అవుతున్న ఆర్జీలకు నిర్ణీత గడువులోగా సంబంధిత శాఖల అధికారులు పరిష్కారం చూపాలన్నారు. ఏ స్థాయిలోను పెండిరగ్‌ ఆర్జీలు ఉండరాదని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ డా. పి. సంపత్‌ కుమార్‌, డిఆర్‌వో ఎస్‌ వి నాగేశ్వరరావు, హౌసింగ్‌ పిడి రజిని కుమారి, డిఇవో సివి రేణుక, డిఎస్‌డివో యు. శ్రీనివాస్‌రావు, ఛీఫ్‌ కోచ్‌ ఎస్‌ ఏ అజీజ్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *