Breaking News

ఇంటి వద్దే నిత్యావసర సరుకుల పంపిణీ చేయండి..

-వాలంటీర్ల సమన్వయంతో పంపిణీ ప్రదేశాలను గుర్తించండి..
-ప్రతీ నెల 1వ తేదినే సరుకుల పంపిణీ ప్రారంభించండి.
-జాయింట్‌ కలెక్టర్‌ డా. పి. సంపత్‌ కుమార్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కార్డుదారులకు ఇంటి వద్దే నిత్యావసర సరుకులను పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డా. పి. సంపత్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. నగరంలోని ఆరండల్‌పేట బి.ఆర్‌ అంబేద్కర్‌ భవన్‌లో యండియు ఆపరేటర్లు, చౌక ధరల దుకాణ డీలర్లు, పౌరసరఫరాల అధికారులు సిబ్బందితో నిత్యావసర సరుకుల పంపిణీ పై బుధవారం జాయింట్‌ కలెక్టర్‌ డా. పి. సంపత్‌ కుమార్‌ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ పి. సంపత్‌ కుమార్‌ మాట్లాడుతూ ప్రతీ నెల కార్డుదారులకు నిత్యావసర సరుకులను మొబైల్‌ డిస్పర్సింగ్‌ యూనిట్‌ ( యండియు ) వాహనాల ద్వారా ఇంటి వద్దనే పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ విధానాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిలో భాగంగా డిసెంబర్‌ 1 వ తేది నుండి అన్ని యండియు వాహనాల ఆపరేటర్లు ఉదయం 7 గంటల నుండే కార్డు దారుల ఇంటి వద్దనే సరుకులను పంపిణీ చేయాలని ఆదేశించారు. పౌరసరఫరాల అధికారులు, యండియు ఆపరేటర్లు, గ్రామ వార్డు సచివాలయాల పరిధిలోని వాలంటీర్లతో సమన్వయం చేసుకుని ఆయా కార్డుదారుల పరిధిలో 5 నుండి 10 పంపిణీకి అనువుగా ఉండే ప్రదేశములను గుర్తించాలన్నారు. గుర్తించిన ప్రదేశాలలో పంపిణీ జరిగే విషయాన్ని ముందుగా వాలంటీర్ల ద్వారా కార్డుదారులకు తెలియజేయాలన్నారు. యండియు ఆపరేటర్లు కార్డుదారులకు సరుకులను నిర్ణీత సమయములో ఖచ్చితమైన తూకం తో పంపిణీ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్డుదారులకు ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న పోషక విలువలతో కూడిన సార్టెక్స్‌, పోర్ట్‌ పైడ్‌ బియ్యం ప్రాముఖ్యత వివరించి, సంబంధిత బియ్యం వాడకం వలన పౌష్టిక విలువలు పెరగడం, ముఖ్యంగా షుగర్‌ వ్యాధి గ్రస్తులకు షుగర్‌ ఆదుపులో ఉండేలా ఉపయోగ పడుతుందనే విషయాన్ని తెలపాలన్నారు. నిత్యావసర సరుకుల పంపిణీలో యండియు ఆపరేటర్ల పై కార్డుదారుల నుండి ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని జాయింట్‌ కలెక్టర్‌ సంపత్‌ కుమార్‌ హెచ్చరించారు.
సమావేశంలో డిఎస్‌వో జి. మోహన్‌బాబు, ఎఎస్‌వో ధనుంజయరెడ్డి, పారసరఫరాల శాఖ డిప్యూటి తహాశీల్థార్లు ఎస్‌పి షాపు డీలర్లు, యండియు ఆపరేటర్లు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *