అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయం యొక్క మొదటి మ్యానేజ్మెంట్ కమిటీ సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో గురువారం విశ్వవిద్యాలయ ప్రత్యేక అధికారి మరియు పశు సంవర్ధక, డైరీ & మత్స్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అధ్యక్షతన జరిగింది. సదరు సమావేశంలో మత్స్యశాఖ కమిషనర్ కె. కన్నబాబు, ఆర్థిక శాఖ కార్యదర్శి కె. వి.వి. సత్యనారాయణ, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డా. ఎల్. నరసింహమూర్తి మరియు విశ్వవిద్యాలయ రిజిస్టర్ డాక్టర్ ఓ. సుధాకర్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు:-
1. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి రూ. 12.69 కోట్ల సవరించిన బడ్జెట్ ప్రతిపాదనలు మరియు 2023-24 ఆర్ధిక సంవత్సరానికి రూ. 19.64 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలు ఆమోదించారు.
2. విశ్వ విద్యాలయం లోని కళాశాలలు మరియు పరిశోధన కేంద్రాలలో బోధనా సిబ్బంది యొక్క కొరతను అధిగమించడానికి తాత్కాలిక ప్రాతిపదికన యూజీసీ నియమ నిబంధనల మేరకు గెస్ట్ ఫ్యాకల్టీ నియమించడానికి ఆమోదం తెలిపారు.
3. విశ్వవిద్యాలయం నియమ నిబంధనలు రూపొందించేత వరకు, మత్స్య విశ్వవిద్యాలయం యొక్క మాతృ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, తిరుపతి వారి నియమ నిబంధనలు ప్రకారం విశ్వవిద్యాలయ పరిపాలన కార్యకలాపాలు జరిపేందుకు ఆమోదం తెలపడం జరిగింది.
4. 01.01.2022 మరియు 01.07.2022 నుంచి విశ్వవిద్యాలయ ఉద్యోగులకు ఇవ్వాల్సిన కరువు భత్యం పెంపుదలను ఆమోదించారు.
5. విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది పదోన్నతులకై డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలపడం జరిగింది.
Prajavartha Online Telugu News