-ఎపి శాక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ రాజేంద్ర కుమార్ ఉద్ఘాటన
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
హెచ్ఐవి బాధితులు అవసరమైన విద్య, నివాసం వంటి అంశాలలో సాయం కోసం ఏ సమయంలోనైనా తనను సంప్రదించవచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణా సంస్థ (ఎపి శాక్స్) ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ బి రాజేంద్రకుమార్ లఘింశెట్టి ఉద్ఘాటించారు. డిసెంబర్ 1వ తేదీ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా ఎపి శాక్స్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడ ఐఎంఎ హాల్లో నిర్వహించిన ‘సామూహిక అల్పాహార విందు’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాధిత రోగుల పిల్లల జీవిత లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. హెచ్ఐవి బాధిత రోగులు, వైరస్ సోకిన వారి పిల్లలు ఈకార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని గీత న్రుత్యాలతో ఆహూతులను అలరించారు. వీరందరికీ దాతల సహకారంతో స్కూల్ కిట్లను బహుమతులుగా అందచేశారు. ఈ సందర్భంగా పిల్లలకు పెయింటింగ్, డ్రాయింగ్ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందచేశారు. ఎపి శాక్స్ ఎపిడి డాక్టర్ కె కోటేశ్వరి, ఎపి శాక్స్ ఎస్టిఐ, ఇసి డాక్టర్ టి మంజుల ఆహూతులకు స్వాగతం పలికిన ఈ కార్యక్రమంలో ఇంకా ఎన్టిఆర్ జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ సుహాసిని, డిఎల్ఎటిఓ హెచ్ఓ, క్రిష్ణా జిల్లా డిఎసిఓ డాక్టర్ జె ఉషారాణి, ఎన్టిఆర్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ డాక్టర్ జి సమరం, ఎపి శాక్స్ నుండి బిఎస్డి జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కామేశ్వర ప్రసాద్, సిఎస్టి జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, పెప్ఫార్ సమన్వయకర్త డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, టిఎన్పి కుమారి రేణుక, ఎపిశాక్స్ భాగస్వామ్య సంస్థలు వైఆర్జి కేర్, యునిసెఫ్, డబ్ల్యు హెచ్ఓ, షేర్ ఇండియా, విహెచ్ఎస్, సాథిలకు చెందిన ప్రతినిధులు, పలు స్వచ్ఛంద సంస్థలకు చెందిన సభ్యులు పాల్గొన్నారు. అల్పాహార విందు సమయంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ఐవి బాధితులు తమ అనుభవాలను ఎపిశాక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ తో పంచుకున్నారు.
Prajavartha Online Telugu News