గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ బూత్ ల్లో డిసంబర్ 2 మరియు 3 తేదీల్లో (శని,ఆదివారాల్లో) ఓటర్ల స్పెషల్ క్యాంపెయిన్ డేస్ ని నిర్వహిస్తున్నామని నగర కమిషనర్, తూర్పు ఈ.ఆర్.ఓ. కీర్తి చేకూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలలోని 532 పోలింగ్ బూత్ ల్లో శని, ఆదివారాల్లో ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు స్పెషల్ క్యాంపెయిన్ డేస్ లో భాగంగా బిఎల్ఓలు ఓటర్ల జాబితా, వివిధ ఫారాలతో అందుబాటులో ఉంటారని తెలిపారు. ఓటు కల్గిన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ ఓటు ఉన్నది, లేనిదీ స్వయంగా పరిశీలించుకోవాలని, ఓటర్ కార్డ్ లో ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే వెంటనే సంబందిత బిఎల్ఓకి నిబందనల మేరకు తగిన ఆధారాలతో దరఖాస్తు పూర్తిచేసి అందించాలని పేర్కొన్నారు. క్యాంప్ ల్లో ప్రజల నుండి నూతన ఓటు కై దరఖాస్తులు, ఓటర్ కార్డ్ లో చిరునామా, పేరు, పుట్టిన తేది తదితర మార్పుల కై అర్జీలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జనవరి 5 న ఓటర్ల తుది జాబితా విడుదలకు ఎన్నికల సంఘం గడవు ప్రకటించినందున, ఓటర్ల జాబితా ముసాయిదా సవరణకు ఇదే ఆఖరి అవకాశం కనుక నగరంలో 18 ఏళ్లు నిండి ఓటు అర్హత కల్గిన యువత స్వచ్చందంగా ఓటు కోసం ఫారం-6 ని పూర్తి చేసి ఓటు హక్కుని పొందాలని కోరారు. ఇప్పటికే నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఓటర్ల హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, ఓటుకి సంబందించిన సమాచారం కోసం 0863-2345104, 2345105 నంబర్లకు ఫోన్ చేయవచ్చని తెలిపారు. సూపర్వైజరి అధికారులు క్యాంపెయిన్ డేస్ ల్లో బిఎల్ఓలు విధుల్లో పూర్తి స్థాయిలో ఉండేలా పర్యవేక్షణ చేయాలని, ఏఈఆర్ఓలు ఆకస్మిక తనిఖీలు చేయాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే బిఎల్ఓలపై చర్యలకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
Prajavartha Online Telugu News