Breaking News

మహాత్మాగాంధీ ఆశయ సాధనకే నా పోరాటం… : గాంధీ నాగరాజన్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటు విలువను అందరూ గుర్తించాలని, కులం పేరుతో, మతం పేరుతో, డబ్బుకు, మందుకు, ఉచితాలకు లొంగిపోయి అమూల్యమైన ఓటును స్వార్ధపరులకు వేయకూడదని, స్త్రీ రక్షణ లేని ప్రజాస్వామ్యం నిజమైన ప్రజాస్వామ్యం కాదని, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి… బ్రతుకుదాం… బ్రతికిద్దాం… బ్రతికించటం కోసం బ్రతుకుదాం… బ్రతికితే దేశం కోసం… చస్తే దేశం కోసం…ఇది నా జీవిత విధానం అని గాంధీ దేశం సోషల్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ అధ్యక్షులు ఆర్‌ ఆర్‌ గాంధీ నాగరాజన్‌ అన్నారు. గురువారం ఊర్మిళానగర్‌లోని ట్రస్ట్‌ కార్యాలయంలో మహాత్మా గాంధీని గాడ్సే హత్య చేసిన జనవరి 30వ తేదీని పురస్కరించుకొని ప్రతి నెల 30వ తేదీన చేస్తున్న రీతిలోనే కళ్లకు గంతలు కట్టుకుని ఆయన సత్యాగ్రహ నిరాహారదీక్ష చేసారు. ఈ సందర్భంగా గాంధీ నాగరాజన్‌ మాట్లాడుతూ తాను ప్రతి నెల 30వ తారీఖున కళ్ళకు గంతలు కట్టేది గాంధీ మహాత్ముడి కలలను నిజం చేసేందుకేనని అన్నారు. స్వాతంత్య్రం కోసం పాటుపడిన జాతిపిత మహాత్మాగాంధీ, బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ కఠోర శ్రమను, ప్రజాస్వామ్య విలువలను ప్రజలు పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. స్వార్ధపు రాజకీయ నాయకుల చేత చిక్కి శిక్షించబడుతున్న ప్రజాస్వామ్యాన్ని, ప్రజలు సరైన వ్యక్తికి, వ్యక్తిత్వానికి ఓటు చేసి రక్షించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీదేశం ట్రస్ట్‌ మహిళా అధ్యక్షురాలు ఆర్‌.ఎన్‌.శివరంజని, ట్రస్ట్‌ ఏపీ అధ్యక్షురాలు బి.భారతి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *