మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో 24 గంటలు అందుబాటులో ఉండేలా ఈనెల 3 వ తేదీ నుండి 7వ తేదీ వరకు సిబ్బందికి 3 షిఫ్టులలో విధులు కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణ జిల్లా కలెక్టరేట్లో తుఫాను పరిస్థితులను పర్యవేక్షించేందుకు 08672-252572, 252000 ఫోన్ నెంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో 3 షిఫ్టులలో 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉండేలా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు.
ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రెండవ షిఫ్ట్, రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మూడో షిఫ్టు లో సిబ్బందికి కలెక్టర్ విధులు కేటాయించారు.
ఈనెల 3 వ తేదీ నుండి 7వ తేదీ ఉదయం వరకు కంట్రోల్ రూమ్ లో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ఆదేశించారు.
Prajavartha Online Telugu News