విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం లో జనరంజక పాలన అందిస్తుంటే చూసి ఓర్వలేక ప్రతిపక్ష టీడీపీ,దాని తోక పార్టీలు రాజకీయ లబ్ది కోసం అసత్య ప్రచారాలు చేస్తున్నాయని వాటిని త్రిప్పికొడుతూ ప్రజలకు వాస్తవాలను వివరించే బాధ్యత పార్టీ నాయకులదే అని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ఆ పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. మంగళవారం నియోజకవర్గ పరిధిలోని 15,19 డివిజన్ ల పార్టీ కార్యాలయలలో ఆయా డివిజన్ ల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవినాష్ పలు అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మంచిని, అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని పార్టీకి మరింత చేరువ చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో 15 వ డివిజన్ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,19 వ డివిజన్ కార్పరేటర్ రెహానా, మాజీ డిప్యూటీ మేయర్ అల్లా చల్లారావు కోఆప్షన్ సయ్యద్ అలీమ్, 19 వ డివిజన్ ప్రెసిడెంట్ జగ్గ విజయ్, 15 డివిజన్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి, భుజంగరావు, కొండ మేస్త్రి, శ్రీనివాస్, ఖాదర్ భాయ్, విస్సు, సూరి, హరీష్, బాలాజీ, చిన్న, రవి, నరసింహారావు, రెహమాన్, సత్యనారాయణ వలి. Sk, వెంకటేశ్వరరావు, sk. సుభాని,అలీ, అహ్మద్ షరీఫ్, ఉస్మాన్, జావిద్ పటాన్ ఖాన్, పోతురాజు, రాము, యేసు రాజు, సలీమ్, అనీత,రతన కుమారీ, నాగ లత, రమ అదిల్ రంగ, ఇంతియాజ్, సలీమ్, అలీ భాయ్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News