విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని) ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గం లోని 41వ డివిజన్ భవానిపురం గాలిబ్ షాహిబ్ దర్గా ప్రాంతంలో డివిజన్ అధ్యక్షులు షేక్ సుభాని, క్లస్టర్ ఇంచార్జ్ కరీముల్లాహ్, యూనిట్ ఇంచార్జ్ శానం వాణి, సమద్ బాషా, ఆధ్వర్యంలో బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్.ఎస్.బేగ్ మాట్లాడుతూ.. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడి ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది. నేడు ఈ ప్రభుత్వం వచ్చాక అన్ని విధాలా అపరిశుభ్రత వాతావరణం నెలకొని దోమలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్తే రోగాల బారిన పడి ఉన్నారు ఎవరు కూడా ఇక్కడ వచ్చి కనీసం ఇక్కడ మందు చెల్లడం గానీ సానిటేషన్ గురించి పట్టించుకోవడం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హాయంలో లేక నివసించ నిరుపేదలకు టిడ్కో కో ఇల్లును పూర్తిస్థాయిలో ఇల్లును కట్టేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక తెలుగుదేశం వాళ్లకి డబ్బులు ఇచ్చారు మాకు ఇస్తేనే మేము ఇల్లు ఇస్తాం అని ఇబ్బంది కి గురు చేస్తూ ఈరోజు వరకు వాళ్లు వడ్డీ కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ స్కూల్ చూసాం నాడు నేడు అని గొప్పలు చెప్పారు ఎక్కడ ఆది కనపడటం లేదు. ఇక్కడ ఉన్న ఏమ్మెల్యే వాకబోర్డ్ ఆస్తులు కాజేస్తున్నాడు, వక్ఫ్ ఆస్తుల కు చంద్రబాబు రక్షించారు. ఆన్లైన్ చేయించారు. నేడు వైకాపా ప్రభుత్వం దర్గా ని గాలికి వదిలేసారు. 4 సంవత్సరం లో ఏమి చేయలేదు. ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు ఈ ప్రభుత్వం ని ఇంటికి పంపిందా అని చూస్తున్నారు. జగన్ వచ్చి కరెంట్ రేట్ పెంచి ఇబ్బంది పెడుతున్నారు. నిత్యావసర వస్తువులు ఖరీదు పెరిపోయాయి. ఉర్దూ స్కూల్ లో కనీసం వస్తులు లేకుండా విద్యార్థుల ఎలా వస్తారు అని ప్రశ్నించారు.
క్లస్టర్ ఇంచార్జ్ సయ్యద్ కరిముల్లా మాట్లాడుతూ… తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనారిటీలకు ఆస్తులకి మైనార్టీ బిడ్డలకు రక్షణ లేకుండా పోతుందని, చంద్రన్న బాబు ప్రభుత్వంలో మైనార్టీలకు పూర్తి రక్షణగా కల్పించి ఆస్తులకు చట్టబద్ధత కల్పించారని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో రంజాన్ తోఫా షాది ముబారక్ వంటి పథకాలను ఇచ్చి ముస్లిం పేద వారికీ అండగా నిలిచారు అన్నారు. ఈ వైకాపా ప్రభుత్వం వచ్చిన దగ్గరనుంచి అతివృష్టి అనావృష్టి లాగా పరిపాలన సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం. ఎస్ బేగ్ సోదరీ షకీలా బేగం షేక్ ఫక్రుద్దీన్, మహమూద్, అఖిల్ భాష, సాబీర్ ఖాన్, ముజీబ్, ఇస్మాయిల్ జబీవుల్లహ్ మరియు టీమ్ టిడిపి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News