-ఏ పి సి సి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
‘‘విజయవాడ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిస్వార్ధ ప్రజాసేవకురాలని త్యాగనిరతికి మరోపేరని అంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు శనివారం కొనియాడారు. అతిక్లిష్ఠ సమయంలో ఏఐసిసి అధ్యక్షురాలిగా కాంగ్రెస్ పార్టీని ఏకథాటిపై ముందుకు నడిపించిన నాయకురాలు సోనియా అని ఆయన అన్నారు. విజయవాడలో ఏపిసిసి ప్రధాన కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో శనివారం రుద్రరాజు నాయకత్వంలో సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీరామమూర్తి అధ్యక్షత వహించారు. సోనియా గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల నేతృత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపిస్తామని ఈ సందర్భంగా రుద్రరాజు మాట్లాడుడూ పునరుద్గాటించారు.
సోనియాగాంధీ పుట్టినరోజు పురస్కరించుకుని బారీ కేకును కట్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మీచౌంగ్ తుఫాన్ ద్వారా పంట దెబ్బతిన్న జిల్లాల రైతులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపట్టాలని నష్టపరిహారం త్వరగా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మీడియా సమావేశం అనంతరం నిర్మల్ హృదయభవన్‌లో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ సమీపంలోని కానూరులో అమీన్‌బాయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమంలో శ్రీ రుద్రరాజు పాల్గొని వృద్ధులను పరామర్శించారు.
పి సి సి అధ్యక్షులుగా గిడుగు రుద్రరాజు మొదటి సంవత్సరం పూర్తి
పిసిసి అధ్యక్షుడుగా గిడుగు రుద్రరాజు మొదటి సంవత్సరమును సమర్ధవంతంగా, దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారని ఆంధ్రరత్న భవన్‌లో శనివారం జరిగిన నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నరహరిశెట్టి నరసింహారావు అభినందించారు. ఈ సభకు పిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్ శ్రీరామమూర్తి అధ్యక్షత వహించారు. గిడుగు రుద్రరాజు పార్టీ పగ్గాలు చేపట్టి సమర్ధవంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారని ఆయన పార్టీకి చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ విజయానికి కృషి చేస్తారన్న ఆశాభావాన్ని పలువురు వక్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీ రుద్రరాజును పార్టీనాయకులు పలువురు దుశ్శాలువాలతో సన్మానించారు. పల్నాడు జిల్లా, అన్నమయ్య జిల్లా మరియు శ్రీకాకుళం జిల్లాల నుండి వచ్చిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రుద్రరాజు వారిని కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు.
ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ మరియు పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ జిల్లాల నుండి వచ్చిన పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్న ఈ వేడుకలు ఘనంగా ముగిశాయి.
Prajavartha Online Telugu News