Breaking News

సీపీఐ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో అఖిలపక్ష నేతలు, రైతు, వ్యవసాయ కార్మిక, సాగునీటి సంఘాల నాయకులు

-ఈ నెల 14న కలెక్టరేట్‌ల వద్ద ధర్నాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో మిచౌంగ్‌ తుఫాను, కరువు నష్టాలపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడనాడాలని అఖిలపక్షాల నేతలు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తుఫాన్‌, కరువు నష్టాన్ని జాతీయ విపత్తుగా గుర్తించి రాష్ట్రానికి తక్షణ సాయంగా కేంద్రం వెయ్యి కోట్ల రూపాయలు, పూర్తిసాయంగా రూ.10 వేల కోట్లు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.
స్థానిక దాసరి భవన్‌లో శనివారం జరిగిన ఈ సమావేశానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అధ్యక్షత వహించారు. అటు మెట్ట ప్రాంత రైతులు కరువుతో, ఆయకట్టు ప్రాంత రైతులు తుఫానుతో తీవ్ర ఇక్కట్లు పాలైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని, కరువు, తుఫాన్‌ వల్ల నష్టపోయిన రైతులు, వ్యవసాయ కార్మికులు, వరద బాధితులను ఆదుకోవాలని పంట నష్టాలను అంచనా వేయించి, రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ తుఫాను, కరువు నష్టాన్ని కేంద్రం జాతీయ విపత్తుగా గుర్తించి రాష్ట్రానికి రూ.1000 కోట్లు తక్షణ సాయం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో సుమారు 20 లక్షల ఎకరాలకుపైగా అపార నష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వం మాత్రం 1.47 లక్షల హెక్టార్లలో మాత్రమే పంట నష్టం జరిగిందని ప్రకటించటం దారుణం అన్నారు. అన్నమయ్య జిల్లా మొదలుకుని శ్రీకాకుళం జిల్లా వరకు తీర ప్రాంత జిల్లాలో లక్షలాది ఎకరాల పంటలు నీటమునిగాయి చెప్పారు. నష్టపోయిన పంటలను గుర్తించి అక్రమాలు జరగకుండా ఎన్యూమరేషన్‌ చేయాలని, కౌలు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతి గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధితో పాటు రైతు సంఘాల బాధ్యులను ఎన్యూమరేషన్‌ కమిటీ వేయాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 11 వతేదీన అన్ని జిల్లాల్లో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహించాలని, 14వ తేదీన కలెక్టరేట్‌ ముందు నిరసనలు తెలిపాలని రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్ణయించింది.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమాహేశ్వరరావు, పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రామ్మోహన్‌రావు, అమ్‌ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు జిఎస్‌.ఫణిరాజ్‌, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు డి.హరనాధ్‌, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర నాయకులు ఖాదర్‌బాషా, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌.కోటేశ్వరరావు, తెలుగు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మరెడ్రి శ్రీనివాసరెడ్డి, రైతు సంఘం సీనియర్‌ నాయకులు వై.కేశవరావు, ఆల్‌ ఇండియా కిసాన్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి వెంకట రెడ్డి, సాగునీటి సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్‌ ఆళ్ల గోపాలకృష్ణారావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్‌, అక్కినేని వనజ, సీపీఐ కృష్ణాజిల్లా కార్యదర్శి టి.తాతయ్య, ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్‌, విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *