Breaking News

ప్రభుత్వ ఉత్తర్వులు 117 రద్దు చేయాలి… : డిటిఎఫ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఉత్తర్వులు 117 రద్దు చేయాలని, 3-4-5 తరగతుల తరలింపు నిలిపివేయాలని, ఏపి జిపిఎస్ ను కూడా ఉపసంహరించుకొని ఓపిఎస్ విధానాన్ని అమలు చేయాలని డి.టి.ఎఫ్. రాష్ట్ర అధ్యక్షులు కె.నరహరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక గాంధీనగర్ ధర్నా చౌక్ లో శనివారం డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ అధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కే.నరహరి మాట్లాడుతూ పలు ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం త్వరత గతిన పరిష్కరించని, పక్షంలో పరిష్కారం కొరకు డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డిటిఎఫ్) ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించామని, ప్రభుత్వానికి స్పష్టంచేసింది. ప్రభుత్వ ఉత్తర్వు 117, 128, 84, 85ల ప్రభావంతో వేలాది ప్రాధమిక పాఠశాలలు మూతకు గురౌతున్నాయని ప్రాథమిక తరగతులు అందుబాటులో లేక పేదపిల్లలు సైతం అనివార్యంగా ప్రైవేటు పాఠశాలవైపు వెళ్ళిపోతున్నారని తెలిపారు. దేశంలో అనేక రాష్ట్రాలు సిపిఎస్. రద్దు చేసి ఓపిఎస్ అమలు చేస్తున్నందున మన రాష్ట్రంలో ఓపిఎస్ అమలు సాధ్యంకాదని పొంతనలేని లెక్కలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, పలు సమస్యల మీద ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి చొరవచూపాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డిటిఎఫ్ సభ్యులు, ఫెన్షనర్స్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *