Breaking News

అరసవిల్లి అరవింద్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ వారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్‌ వేడుకలు

నున్న, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో అరసవిల్లి అరవింద్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ వారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అరసవిల్లి అరవింద్‌ సారథ్యంలో చేసే సేవా కార్యక్రమంలో భాగంగా ఎబినేజర్‌, కండ్రిక, నున్ననందు సోమవారం సెమీ క్రిస్మస్‌ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ట్రస్ట్‌ సభ్యులు మాట్లాడుతూ యేసుక్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరూ అనుసరించి నీతివంతమైన జీవితాన్ని కొనసాగించాలని, అదేవిధంగా ఆయన సూచించిన క్రీస్తుబోధనలు అనుసరిస్తూ ఆనందోత్సాహాల మధ్య క్రిస్మస్‌ పండుగ జరుపుకోవాలని, ఏసుక్రీస్తు చల్లని దయ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని తెలియజేశారు. తమ ట్రస్ట్‌ ప్రెసిడెంట్‌ అరసవిల్లి అరవింద్‌ తమ చుట్టూ ఉన్న సమాజానికి ఎంతోకొంత తమ వంతు సహాయం ఎల్లప్పుడూ అందించాలని తపించే ఒక మంచి సేవా దృక్పథం కలిగిన వ్యక్తి అని, ఈ ట్రస్ట్‌ స్థాపించినప్పటి నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్విహిస్తున్నారని, ఇతరులకు సేవ అందించే విషయంలో ఎప్పుడు వెనుక అడుగు వేయొద్దు అని తమ ట్రస్ట్‌ సభ్యులకు పిలుపునిచ్చినట్లుగా తెలియజేసారు. ఇటీవల మందడం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని నూతన భావన నిర్మాణం చేపట్టడం ఇంకా విజయవాడ నగరంలో గత కొన్ని సంవత్సరాలుగా అన్నార్తులకు భోజనం వితరణ, అనాధ పిల్లలకు ఉచిత కంటి పరీక్షా శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, చలివేంద్రాల ఏర్పాటు, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం విదితమేనన్నారు. పవిత్ర క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సెమీ క్రిస్మస్‌లో సుమారు 300 మంది పేదలకు, క్రిష్టియన్‌ కుటుంబాలకు ట్రస్ట్‌ తరఫున స్త్రీలకు చీరతోపాటు, నిత్యావసర సరుకులు అందచేసి చర్చ్‌ నందు కేక్‌ కట్‌ చేసి పంపిణీ చేశారు. క్రిస్మస్‌ వేడుకలు మరిన్ని ప్రాంతాలలో కూడా నిర్వహించబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఫాదర్స్‌, చర్చ్‌ సంఘస్తులు, భక్తులు, స్థానికులు, ట్రస్ట్‌ సభ్యులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *