విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధమ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాల మేరకు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 11 ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ పరిధిలోని సమస్యలను అర్జీ రూపంలో కార్పొరేషన్ అధికారులకు సమర్పించగా సంబంధిత అధికారులు ఆ సమస్యకు సత్వర పరిష్కారం వస్తుందని అన్నారు. సోమవారం ఉదయం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భాగంగా ఇంజనీరింగ్ విభాగానికి నాలుగు, టౌన్ ప్లానింగ్ నాలుగు, రెవెన్యూ రెండు, పిఒయుసిడి 1 మొత్తం కలిపి 11 అర్జీలు, ప్రజలు నుండి అధికారులు దరఖాస్తు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్(ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, అడిషనల్ కమిషనర్ (జనరల్ ) కె. శకుంతల, చీఫ్ మెడికల్ ఆఫీసర్ రత్నావళి, సిటీ ప్లానర్ జీవి జీ ఎస్ వి ప్రసాద్, డిప్యూటీ కమీషనర్ (రెవిన్యూ) వెంకటలక్ష్మి, పి ఓ యు సి డి రోహిణి, ఏ డి హెచ్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News