– జిల్లాస్థాయి జగనన్నకు చెబుదాం-స్పందనకు 134 అర్జీలు: కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అర్జీదారులు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందేలా జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమానికి వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక కలెక్టరేట్లో కలెక్టర్ ఎస్.డిల్లీరావు, డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రెవెన్యూ విభాగానికి సంబంధించి 61, పోలీస్ శాఖకు సంబంధించి 20, మునిసిపల్, పట్టణాభివృద్ధి-10, డీఆర్డీఏ-12.. ఇలా వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 134 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్.డిల్లీరావు మాట్లాడుతూ అర్జీలను నిర్దిష్ట గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని సూచించారు. అర్జీలు రీఓపెన్ కాకుండా ప్రత్యేకంగా దృష్టిసారించి.. క్షేత్రస్థాయిలో అధికారులతో సమన్వయం చేసుకొని పరిష్కరించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమాన్ని అమలుచేస్తోందని.. ఈ కార్యక్రమం అమల్లో జిల్లాను ముందు వరుసలో నిలిపేందుకు అధికారులు కృషిచేయాలని కలెక్టర్ ఎస్.డిల్లీరావు సూచించారు.
Prajavartha Online Telugu News