Breaking News

జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశము

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా “జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశ ము” ను 21.12.23 వ తేదీన కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లా వ్యవసాయ అధికారి S.ప్రసాద రావు  ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వారు మాట్లాడుతూ మిచాంగ్ తుఫాను వలన డిసెంబరు మాసంలో 106.9 మి.మీ గాను 409.1 మి.మీ వర్షపాతం నమోదైనందున (+282.7% ఎక్కువ) వరి, వేరుశనగ, మినుము పంటలు దాదాపు 28000 ఎకరాలలో దెబ్బ తిన్నాయని, 4971 ఎకరాలలో ఇసుక మేటలు వేయడం మరియు 978 ఎకరాలలో నేల కోతకు గురవడం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేయడం జరిగిందని తెలిపారు. పంట నష్టం జరిగిన గ్రామాలలో రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా పంట నష్టం గణన (Enumeration) ను ఈ నెల 19 వ తేదీకి నిర్వహించి రైతుల జాబితాను సామాజిక తనిఖీ కొరకు 22 వ తేదీ వరకు రైతు భరోసాకేంద్రాలలో ఉంచడం జరిగిందని, ఈ నెల 26 వ తేదీకి తుది జాబితాను ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుందని తెలిపారు. తుఫాను వలన నష్టపోయిన రైతులకు 80% సబ్సిడీ తో 6346 క్వింటాళ్ళ వరి విత్తనాలను సరఫరా చేయడం జరుగుతుందని, ఇప్పటి వరకు 4500క్వి. విత్తనాలు సరఫరా చేయడం జరిగిందని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలలో రబీ సీజనుకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. రబీ సీజనులో సాగు చేసిన పంటల వివరాలను రైతులు ఇ-క్రాప్ యాప్ నందు నమోదు చేయించుకోవాలని సూచించారు.
అప్సర్ సయ్యద్, పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు వారు మాట్లాడుతూ మిచాంగ్ తుఫాను వలన నష్టపోయిన రైతులకు పాడి రైతులకు 18.975 లక్షల రూపాయలను పశు నష్టపరిహారం ఇవ్వడం జరిగిందని, రైతులకు అవసరమైన TMR ఫీడును సరఫరా చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగిందని తెలిపారు.
రాధాకృష్ణమూర్తి, నీటి పారుదల శాఖ వారు మాట్లాడుతూ కండలేరు జలాశయం నందు నీటి లభ్యత చాలా తక్కువగా ఉన్నది. ఐ.ఎ.బి సమావేశంలో తాగునీటి వరకు మాత్రమే విడుదల చేయుటకు ఆదేశాలు జారీ చేయడమైనది. కావున కండలేరు జలాశయం నీటి లభ్యత పెరిగినచో వ్యవసాయంనకు విడుదల చేయగలరని తెలియజేయడమైనది.
పుష్పలత, ఉద్యానశాఖాధికారి వారు మాట్లాడుతూ మిచాంగ్ తుఫాను వలన దాదాపు 1250 ఎకరాలలో పంట నష్టం వాటిల్లిందని, మిరప పంట ఎక్కువగా నష్టపోయిందని తెలిపారు. నష్టపరిహారం కొరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపిస్తున్నామని తెలిపారు.
గంగాధరం, పిచ్చాటూరు మండల అభ్యుదయ రైతు వారు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన వనరులను రైతు భరోసా కేంద్రాలలో అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ చేయించి మార్కెటింగ్ అవాకాశాలను పెంచే దిశగా ఆలోచించాలని సూచించారు.
మహేశ్వర రెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, తిరుపతి వారు మాట్లాడుతూ TCGS 1694 వేరుశనగ రకాన్ని ఈ నెల ఆఖరు వరకు వేసుకోవచ్చని, తుఫాను తాకిడికి గురైన పంటలను కాపాడుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల వేళ పంటల పరిస్థితిపై జేసీ ఇల‌క్కియ పరిశీలన

– క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి రైతుల‌తో మాట్లాడిన జాయింట్ కలెక్ట‌ర్‌ – పంటలకు నష్టం వాటిల్లకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు ఆదేశాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *