-పశ్చిమ నియోజకవర్గంలోని 100 మంది పాస్టర్లకు నూతన వస్త్రాలను బహుకరించిన పోతిన వెంకట మహేష్ విజయలక్ష్మి దంపతులు.
-పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు.
-యేసయ్య దీవెనలు మహేష్ పై ఉండాలని ఆశీర్వదించిన పాస్టర్లు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో క్రిస్టమస్ సందర్భంగా సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు అంతరం 100 మంది పాస్టర్లకు చిరుకానుక( నూతన వస్త్రాలు) అందజేశారు. జనసేన పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తరపున విజయవాడ నగర ప్రజలందరికీ కూడా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, గత రెండేళ్లుగా మేము ఆనవాయితీగా పెట్టుకుని పశ్చిమ నియోజకవర్గం లోని పాస్టర్లకు క్రిస్మస్ సందర్భంగా చిరుకానుక అందించడం జరుగుతుందని వారు కూడా ఈ కానుక స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించుతున్నందుకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలని, రేపు పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని మూడువేల పేద సామాన్య కుటుంబాలకి క్రిస్మస్ కానుకుని అందించడానికి కోమల విలాస్ సెంటర్ వద్ద ఇప్పటికే పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగిందని మేము అందించే ఈ క్రిస్మస్ కానుకుని పేద సామాన్య ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని క్రిస్మస్ రోజున చక్కగా పండగ జరుపుకోవాలని ఆలోచనతో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అదే విధంగా ఈ రోజున పశ్చిమ నియోజకవర్గం లోని సుమారు వందమంది పాస్టర్లకు బట్టలు అందజేయడం అనేది నిజంగా మా యొక్క అదృష్టంగా భావిస్తున్నామని ఈ కార్యక్రమంలో నా సతీమణి పోతిన విజయలక్ష్మి కూడా గత రెండేళ్లుగా పాల్గొంటూ పాస్టర్లకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులుగా ఉంటూ వస్తున్నారని ఈ కార్యక్రమానికి మాకు పాస్టర్ల కి మధ్య సమన్వయకర్తగా నూనె శేఖర్ మరియదాసు ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని, క్రిస్మస్ అంటేనే క్షమ, ప్రేమ, దయ నిస్వార్ధంగా మనం ఇతరుల గురించి జీవించడమనేది తెలియజేసే పండుగ భగవంతుడు యేసయ్య కూడా ఎవరినైనా సరే ప్రేమించమని చెప్పారే గాని ఎక్కడా కూడా ద్వేషం అసూయ పగా ప్రతికారాలు గురించి అవన్నీ కూడా వదిలేసి రావాలి మంచి జీవితం రావాలంటే మనం ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించడం అలవాటు చేసుకోవాలని శత్రువుని కూడా ప్రేమించే దయాగుణం మనకు ఉండాలని ఒక గొప్ప జీవన సూత్రాన్ని కూడా ఏసుప్రభువు మనకు అందజేశారు మరి వారు సూచించిన విధంగానే ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించే విధంగా ప్రయత్నం చేయాలని యేసయ్య చూపించిన మార్గంలోనే ప్రతి ఒక్కరు కూడా పైనుంచి ఉన్నతమైన జీవితం గడపాలని కోరుకుంటున్నానని అదేవిధంగా రేపు జరిగేటటువంటి కోమల విలాస్ సెంటర్ వద్ద క్రిస్మస్ కానుక పంపిణీ కార్యక్రమం కూడా మీరు అందరు కూడా హాజరై కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అన్నారు
Prajavartha Online Telugu News