తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల జనవరి 18 నుండి 20 వరకు మూడు రోజులు స్థానిక శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో భారత పంచాయితీరాజ్ మంత్రిత్వ శాఖ వారి సూచనల మేరకు ఆం.ప్ర రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణపై (LSDGలు) రెండవ థీమ్ అయిన ఆరోగ్యకరమైన గ్రామం (హెల్తీ విలేజ్) అంశంపై జాతీయ వర్క్‌షాప్ నకు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల నుండి మంత్రులు, రాష్ట్ర స్థాయి అధికారులు, ఇతర అధికారులు స్థానిక సంస్థల ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొననున్నారని, ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని జెసి శుభం బన్సల్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం మధ్యాహ్నం స్థానిక శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో హెల్తీ విలేజ్ అంశంపై జాతీయ వర్క్ షాప్ నిర్వహణపై కేటాయించిన విధులు, చేపట్టాల్సిన ఏర్పాట్లపై జెసి శుభం బన్సల్ అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ఎయిర్ పోర్ట్, రేణిగుంట, తిరుపతి రైల్వే స్టేషన్లో, సెంట్రల్ బస్ స్టేషన్ లో హెల్ప్ డెస్క్ ల ఏర్పాట్లు ప్రారంభం కావాలని, రేపటి నుండి ఈ కార్యక్రమానికి కేంద్ర, ఆం.ప్ర రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తదితర ప్రముఖులు రానున్నారని తెలిపారు. వారికి సాంప్రదాయ పద్దతిలో ఆహ్వానం పలకాలని అన్నారు. ప్రముఖులకు, అతిథులకు బస ఏర్పాట్లు పూర్తి వివరాలతో తెలియజేయాలని అన్నారు. బస కోసం తిరుపతిలో 12 హోటల్స్ లో గుర్తించామని రిసెప్షన్ ఏర్పాటు, వారిని వర్క్ షాప్ ప్రాంతాలకు రవాణా ఏర్పాటు పక్కాగా చేపట్టాలని అన్నారు. వివిధ రాష్ట్రాల నుండి డేలిగెట్స్ వస్తున్నందున వర్క్ షాప్, గ్రూప్ డిస్కషన్స్ లో ట్రాన్స్‌లేటర్స్ భాషల తర్జుమా కోసం కేటాయించిన అధ్యాపకులు సకాలంలో హాజరుకావాలని సూచించారు. త్రాగునీటి ఏర్పాట్లు ఆర్ డబ్ల్యు ఎస్, విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ చూడాలని అన్నారు. ఎన్ ఐ సి అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాట్లు చూడాలని ఢిల్లీ, అమరావతి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి లైవ్ లో మాట్లాడే అవకాశం ఉందని ఆడిటోరియంలో ముఖాముఖి ప్రత్యక్షంగా మాట్లాడే విధంగా వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ ఏర్పాటు కావాలని అన్నారు. ప్రారంభోత్సవం కార్యక్రమం లైవ్ ఇవ్వాలని, పూర్తి కార్యక్రమాల ప్రొసీడింగ్స్ వీడియో రికార్డ్ చేయాలని, ఐ అండ్ పిఆర్, పిఐబి సమన్వయంతో పనిచేయాలని అన్నారు. కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలనీ సూచించారు. ఎలాంటి అలసత్వం సహించేది లేదని తెలిపారు.
సమీక్ష అనంతరం సంబంధిత జిల్లా అధికారులతో కలిసి కార్యక్రమ నిర్వహణ ప్రదేశాలను జెసి పరిశీలించారు.
ఈ సమీక్షలో పంచాయతీ రాజ్ డిప్యూటి కమీషనర్ ఆనంద్, డిఆర్ ఓ పెంచల కిషోర్,జీఎం స్మార్ట్ సిటీ చంద్ర మౌళి, ఉమ్మడి చిత్తూరు జిల్లా సిఈఓ జడ్పీ ప్రభాకర్ రెడ్డి, డిపిఓ రాజశేఖర్ రెడ్డి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, ఎస్డిసిలు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు , లైజన్ అధికారులు , తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News