గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కీర్తి చేకూరి తెలిపారు. బుధవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరి రివిజన్ 2024 పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడానికి ఏఈల వారిగా కేంద్రాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించామని తెలిపారు. ఓటర్ల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పై వివిధ రాజకీయ పార్టీలు, ప్రజల నుండి డిశంబర్ 9,2023 నాటికి అందిన ఫిర్యాదులు, అభ్యంతరాలను పరిష్కరించామని, తుది జాబితా ఈ నెల 22 న కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేస్తుందని పేర్కొన్నారు.
సమావేశంలో పశ్చిమ నియోజకవర్గ ఈఆర్ఓ, అదనపు కమిషనర్ కె.లక్ష్మీ శివ జ్యోతి, ఏఈఆర్ఓలు సిహెచ్.శ్రీనివాస్, బి.శ్రీనివాసరావు, సూపరిండెంట్లు సాంబశివరావు, పద్మ, డిప్యూటీ తహసిల్దార్ బి.భాస్కర్, రాజకీయ పార్టీలైన టిడిపి నుండి ఓంకార్, వైఎస్సార్సీపి నుండి డి.జాని బాష, బిఎస్పి నుండి సిహెచ్.వాసు, బిజెపి నుండి ఆర్.భాస్కర్రావు, అమ్ ఆద్మీ నుండి సేవకుమార్, కాంగ్రెస్ నుండి డి.బాలాస్వామి, సిపిఎం నుండి షేక్ ఖాసిం షాహెద్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News