Breaking News

చరిత్రలో మహత్తర ఘట్టంగా అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లు…

-“నభూతో న భవిష్యత్” అనిపించేలా పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నాం.
-జిల్లా కలెక్టరు ఎస్.డిల్లీ రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో ఈనెల 19వ తేదీన జరగనున్న స్వతంత్ర భారతదేశ తొలి న్యాయ శాఖ మంత్రి, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం గతంలో ఎన్నడూ లేని రీతిలో ఒక మహోజ్వల ఘట్టంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగంతో ప్రజా ప్రతినిధులు కూడా కలసి వస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటున్న బహిరంగ సభ నిర్వహించే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, విగ్రహాన్ని ప్రతిష్టించిన స్వరాజ మైదానం ప్రాంగణాలను జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన బుధవారం పరిశీలించారు. గ్యాలరీల ఏర్పాటుకు సంబంధించి ప్రత్యేకంగా అక్కడ జరుగుతున్న పనులను ప్రత్యక్షంగా పరిశీలించి, అవసరమైన మార్పులు చేయాలని అధికారులను ఆదేశించారు. సభికుల రాకపోకలకు అనువైన రీతిలో మార్గాలు ఉండాలన్నారు. వేదికపై ఎటువంటి అసౌకర్యం లేకుండా అతిధులు ఆశీనులయ్యేలా అవసరమైన ఏర్పాట్లు, రాకపోకలను సూచించే బోర్డులు, ప్రవేశ ద్వారం వద్ద రక్షణ చర్యలు, మంచినీరు, సౌండ్ సిస్టం, వేదిక ముందు ఉండాల్సిన ఖాళీ స్థలం, ప్రసారమాద్యమాల ప్రతినిధులకు, ప్రజా ప్రతినిధులకు, రాజకీయ ప్రముఖులకు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి హాజరవుతున్న అంబేద్కర్ వాదులకు వేరువేరుగా క్రమ పద్ధతిలో కుర్చీ వరుసలు ఏర్పాటు చేయాలని సూచించారు. వేదికకు దూరంగా ఉన్న వారు కూడా కార్యక్రమాన్ని ఆహ్లాదంగా వీక్షించేలా, గ్యాలరీల నుంచి కూడా చూసేందుకు వీలుగా ఎల్ఈడి తెరలు ఏర్పాటు చేయాలన్నారు. ఇంత భారీ కార్యక్రమం నగరంలో ఎప్పుడూ జరగలేదన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడం మనకు దక్కిన ఒక అద్వితీయమైన అవకాశంగా భావించి జిల్లా యంత్రాంగం ఈ మహత్తర కార్యక్రమం పూర్తయ్యేంతవరకు నిర్విరామంగా శ్రమింస్తోందన్నారు“నభూతో న భవిష్యత్” అనే స్థాయిలో ఈ కార్యక్రమ నిర్వహణ జరిగేలా ప్రజాప్రతినిధుల సహాకారంతో ప్రణాళిక తో చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్టేడియం పరిశీలన అనంతరం విగ్రహ ప్రతిష్టా ప్రాంగణంలో వివిధ స్థాయిల్లో జరుగుతున్న పనులను పరిశీలించి పనులు వేగంగా పూర్తయ్యేందుకు అవసరమైన సూచనలు చేశారు. బహిరంగ సభ అనంతరం ముఖ్యమంత్రి విగ్రహ ప్రతిష్ట ప్రాంగణానికి రానున్న దృష్ట్యా ప్రజల రద్దీ, భద్రత చర్యలు, సాధారణ పౌరులకు అసౌకర్యం లేకుండా అవసరమైన చర్యలపై కార్లకు సూచనలు చేశారు. ప్రతి అంశంలోనూ స్పష్టంగా ఉండాలని వివిధ శాఖల అధికారులకు జారీ చేశారు ఏ ఏ అధికారి ఎటువంటి బాధ్యత నిర్వహిస్తున్నారు అనే అంశంపై ఈ కార్యక్రమ భాగస్వాములుగా ఉన్న వారందరూ సమన్వయం చేసుకోవడం ద్వారా కార్యక్రమం నిర్వహణ విజయవంతంగా పూర్తి చేయొచ్చని చెప్పారు. కార్యక్రమం పూర్తయ్యేంతవరకు వివిధ స్థాయిల అధికారులు ఏర్పాట్ల పరిశీలన కోసం ఎప్పటికప్పుడు కిందిస్థాయి అధికారులతో చర్చించాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శ్రీనివాస్, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయ కర్త తలశిల రఘరామ్ .ఎం ఎల్ ఏ వెలంపల్లి శ్రీనివాసరావు తూర్పు నియోజక వర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, నగరపాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్ ఫుడ్కర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *