Breaking News

ఈ నెల 21న విఐ లెనిన్‌ శత వర్ధంతి సభలు జరపండి

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సోషలిజం సాధకులు, విప్లవోద్యమ నేత కామ్రేడ్‌ విఐ లెనిన్‌ శత వర్ధంతి సభలను ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. సోవియట్‌ యూనియన్‌ సాధకులు, విప్లవోద్యమ నేత కామ్రేడ్‌ విఐ లెనిన్‌ శత వర్ధంతి సందర్భంగా ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో వర్ధంతి సభలు జరపాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ), రాష్ట్ర సమితి పిలుపునిస్తున్నది. ప్రపంచ శ్రామిక ప్రజల నాయకుడిగా పెట్టుబడిదారీ విధానాలపై అస్త్రాలు సంధించి, శ్రామిక రాజ్య స్థాపనే లక్ష్యంగా సోషలిజం కోసం కామ్రేడ్‌ లెనిన్‌ ఎంతో కృషి చేశారు. కార్మిక, శ్రామికవర్గ పక్షపాతిగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం లెనిన్‌ చూపిన బాట నేటితరం కమ్యూనిస్టులకు ఆదర్శప్రాయం. ప్రస్తుతం దేశంలో బడా పెట్టుబడిదారుల అనుకూల పాలన సాగుతోంది. పాలకుల వత్తాసుతో కార్పొరేట్‌ శక్తుల కనుసన్నల్లో ప్రభుత్వరంగం నిర్వీర్యమైపోతున్నది. విచ్చలవిడిగా శ్రమదోపిడీ జరుగుతున్నది. పోరాడి సాధించుకున్న హక్కులు హరించబడుతున్నాయి. నిర్భంధ, నిరంకుశ విధానాలు అమలవుతున్నాయి. ఈ తరుణంలో శ్రమశక్తిని, కార్మిక, ప్రజా హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అందుకోసం లెనిన్‌ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఈ నెల 21న కామ్రేడ్‌ విఐ లెనిన్‌ శత వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో సిపిఐ ఆధ్వర్యంలో జరిగే సభలలో పార్టీ శ్రేణులు, కమ్యూనిస్టు ఉద్యమాభిమానులలోపాటు కార్మికులు, శ్రామికులు, ప్రజలు అందరూ పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *