Breaking News

స్కిల్ డెవలప్మెంట్ మరియు ఉపాధి కల్పనా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా…!

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణ జిల్లా – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపి.ఎస్.ఎస్.డి.సి) మరియు జిల్లా ఉపాధి కల్పన శాఖ సంయుక్త అధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల అనగా జనవరి 25వ తేదీన ఉదయం 9:30 గంటలకు నుండి గుడివాడ లోనీ వి.కె.అర్. వి.ఎన్.బి & ఎ.జి.కె ఇంజనీరింగ్ కళాశాల నందు “మెగా జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పన శాఖ అధికారి దేవరపల్లి.విక్టర్ బాబు మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు లు సంయుక్త ప్రకటన తెలియజేసారు. ఈ జాబ్ మేళా లో ఎఫ్రానిక్స్, చందు సాఫ్ట్ టెక్నాలజీస్, హెటిరో లాబ్స్, ముత్తూట్ ఫైనాన్స్, జోయాలుక్కస్ జ్యూవెలరీ, సుధీర్ టింబర్ ప్రైవేట్ లిమిటెడ్, గోల్డ్ ప్రిన్స్, వి.ఎన్.ఆర్ జూవెలర్స్, మోహన్ స్పిన్ టెక్స్ లిమిటెడ్, నవత ట్రాన్స్పోర్ట్, మెడ్ ప్లస్ ఫార్మసీ,వరుణ్ మోటార్స్, సంతోష్ ఆటోమోటర్స్ వంటి 13 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హజరవనున్నట్లు వారు తెలిపారు.అధిక సంఖ్యలో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అధ్వర్యంలో ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని ఉపాధి కల్పన శాఖ అధికారి విక్టర్ బాబు తెలిపారు.ఈ జాబ్ మేళా లో 7వ తరగతి నుండి 10వ తరగతి, ఐ.టి.ఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ, బి.టెక్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు పాల్గొనవచ్చు అని ఉద్యోగం చిన్నదా పెద్దదా అన్న అపోహను యువత పెట్టుకోవద్దని, ఉద్యోగం చేసుకుంటూ వెళ్తే అదే ఆ వ్యక్తులను ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది స్కిల్ డెవలప్మెంట్ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఈ జాబ్ మేళాలో ఆయా కంపెనీల ప్రతినిధులు అభ్యర్థుల అర్హతలను మౌఖిక ఇంటర్వూ లను నిర్వహించి ఎంపిక పూర్తి చేస్తారని ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు సుమారు రూ.9,000/- నుండి రూ.30,000/- ల వరకు వేతనంతో పాటు ఇతర అలవెన్స్ లతో కూడిన ఉద్యోగ అవకాశాలు అందించనున్నాయి అని తెలిపారు.అనుభవం ఉన్నవారితో పాటు ఫ్రెషర్స్‌ కూడా ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావొచ్చని అధికారులు తెలిపారు.ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూ జరిగే ప్రదేశానికి రెజ్యూమ్‌తో పాటు విద్యార్హత జిరాక్స్‌ కాపీలు, ఫోటోలు, ఆధార్ కార్డు,అనుభవం ఉన్న వారు వాటి సంబంధిత సర్టిఫికేట్లతో హాజరుకావాల్సి ఉంటుంది అని అన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా skilluniverse.apssdc.in లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. అయితే రిజిస్ట్రేషన్ చేసుకోనివారు నేరుగా వేదిక వద్దకు వచ్చి జాబ్ మేళాలో పాల్గొనవచ్చని సూచించారు.మరిన్ని వివరాలకు కొరకు 7981938644, 9848819682 నంబర్లను సంప్రదించాలని వారు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *