Breaking News

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లో ఆడుదాం ఆంధ్ర

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన ఆడుదాం ఆంధ్రలో భాగంగా ఏపీ ఎస్పీఎఫ్ అధిపతి డాక్టర్ సీఎం త్రివిక్రమ వర్మ, ఐపీఎస్ మరియు బి వి రామిరెడ్డి ఇన్స్పెక్టర్ జనరల్ వారి ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నందు ఏపీఎస్పీఎఫ్ స్పోర్ట్స్ మీట్ 2024 ను తేదీ 19.01. 2024న ఘనంగా ప్రారంభించిన విషయం విధితమే. అందులో భాగంగా 100 మంది ఏపీఎస్పీఎఫ్ సిబ్బంది రెండు రోజులపాటు వాలీబాల్ మరియు షటిల్ బ్యాడ్మింటన్ క్రీడలలో పాల్గొని తమ సత్తా చాటారు. ఏపీఎస్పీఎఫ్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమంలో భాగంగా తేదీ 20.01.2024 న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నందు ముఖ్య అతిథులుగా విచ్చేసిన బీ వీ రామిరెడ్డి, ఐ జి , ఏపీ ఎస్పీఎఫ్ మరియు బీ వీ రవి ప్రకాష్ రెడ్డి, డైరెక్టర్ విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ వారు, ప్రొఫెసర్ శ్రీమతి బి కరుణ, రిజిస్టార్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మరియు ఎం శంకర రావు, జోనల్ కమాండెంట్, ఏపీఎస్పీఎఫ్ విజయవాడ జోన్ వారి చేతుల మీదుగా క్రీడల యందు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రధమ మరియు ద్వితీయ స్థానంలో నిలిచిన జట్లకు ట్రోఫీలను బహూకరించారు. క్రీడల్లో పాల్గొన్న సిబ్బంది అందరికీ బహుమతులు మరియు ప్రశంసా పత్రాలను అసిస్టెంట్ కమాండంట్లు కే. కృష్ణ మూర్తి, బి . శ్రీనివాసరావు, ఎం. కే. వి. న్. గుప్తా, ఎస్.శ్రీనివాసరావు, పి. వి. ఎస్ ఎన్.మల్లికార్జున రావు, టి . కృష్ణమాచారి ప్రదానం చేసారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీఎఫ్ సిబ్బంది మరియు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సిబ్బంది సుమారు 400 మంది పాల్గొని ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *