Breaking News

రైల్వే అండర్ బ్రిడ్జి (RUB) 15 రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తీసురండి

-కెనాల్ బండ్ గ్రీనేరి అభివృద్ధి చెయ్యండి
– రైల్వే అండర్ బ్రిడ్జి, కెనాల్ బండ్ పరిశీలన
-నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
15 రోజుల్లో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, వెహికల్ డిపో వద్ద ఉన్న కెనాల్బండ్ అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు  పార్క్ లో గ్రీనరీ అభివృద్ధి చేయాలని  నగర కమిషనర్ స్వప్నిల్  దినకర్ పుండ్కర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, మంగళవారం  తన పర్యటన లో భాగంగా  మధురానగర్ నందు నగరపాలక సంస్థ అద్వర్యంలో జరుగుతున్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు పరిశీలించారు. మధురానగర్‌లో రైల్వే అండర్  బ్రిడ్జి నిర్మాణం యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు . కనెక్టింగ్ బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావలసిందిగా అధికారులకు ఆదేశాలు. అనంతరం పూర్ణానందన్న ఏలూరు కాలువను, వేసి ఉన్న రోడ్లను పరిశీలించారు. ఫుట్ పాత్ రిపేర్లు చేయాలని, పేవర్ బ్లాక్స్ త్వరగా వెయ్యాలని, ఏలూరు కెనాల్ బండ్లో మొక్కలతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని, అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ పర్యటనలో కమిషనర్ గారితో పాటు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు శ్రీనివాస్ నారాయణమూర్తి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *