-రిటైనింగ్ వాల్ బ్యూటిఫికేషన్ పార్కు పరిశీలన
-పనులను త్వరితగతిన పూర్తి చేయవలసినదిగా ఆదేశాలు
-నగర కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
15-20 రోజుల్లో రివర్ ఫ్రంట్ పార్క్ పూర్తి చేసి ప్రజల ఆనంద విహారానికి అందుబాటులోకి తీసుకురావాలని, కృష్ణానది ఒడ్డున అత్యంత ఆహ్లాదకరంగా సుందరంగా తీర్చిదిద్దాలని నగర కమిషనర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ మంగళవారం ఉదయం రివర్ ఫ్రంట్ పార్కను పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలంటే కేవలం ముఖద్వారమున వెళ్లి చివరి వరకు పనులు పూర్తి చేయాలంటే కష్టమని, వెనక వైపు నుంచి కూడా ఒక మార్గాన్ని సూచించి ఇరువైపులా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
కృష్ణానది రిటైనింగ్ వాల్ వెంబడి సుందరంగా, ఆహ్లాదకరమైన పార్కు ఏర్పాటుకు కనకదుర్గ వారధి నుంచి రామలింగేశ్వర డీపీ స్టేషన్ వరకు 1.25 కి.మీ పొడవున సుమారు రూ.7.8 కోట్ల నగరపాలక సంస్థ వ్యయంతో మరియు రూ.4.5 కోట్ల అర్బన్ గ్రీనరీ వారి వ్యయంతో నిర్మాణం జరుగుతున్న రిటైనింగ్ బ్యూటిఫికేషన్ పార్కును ప్రజలకు త్వరలో అందుబాటులోకి తీసుకు రావాలని అన్నారు. అదేవిధంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ట్రీ కెనాఫీ, వాకింగ్ మరియు సైక్లింగ్ ట్రాక్ రోడ్లు మరియు బెస్మెంట్ పనులను పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూపనులు త్వరితగతిన పూర్తి చేయవలసినదిగా ఇంజనీరింగ్ అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు.
విజయవాడ నగరవాసులకు అభివృద్ధితోపాటు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు వీఎంసీ ప్రణాళికబద్ధంగా పార్కులను అభివృద్ధి చేస్తోందని, నదీతీరంలో సాయంత్ర వేళ కుటుంబ సభ్యులతో గడిపేందుకు రిటైనింగ్ బ్యూటిఫికేషన్ పార్కు ఏర్పాటు చేయడం జరుగుతుందని కమిషనర్ అన్నారు. రివర్ ఫ్రంట్ పార్క్ ది ప్లాజా. వారధి నుంచి రామలింగేశ్వనగర్ వరకు నది వెంబడి రిటైనింగ్ వాలుకు ఆనుకుని నిర్మాణం చేయనున్న ఈ పార్కులో వాకింగ్ ట్రాక్ ఒకేసారి 250-500 మంది వరకు వాకింగ్ చేసేందుకు సౌలభ్యంగా ఉండేలా ట్రాక్ నిర్మాణం జరుగుతోందని. ఇంకా ఆహ్లాదాన్ని కలిగించేందుకు వివిధ రకాల మొక్కలతో గ్రీనరీని అభివృద్ధి చేస్తున్నరని అన్నారు.
నాలుగు మీటర్ల వెడల్పులో సైక్లింగ్ ట్రాక్, దానికి ఆనుకుని 10 మీటర్ల వెడల్పులో ఆహ్లాదకరంగా ఉండేలా పార్కు నిర్మించనున్నారు. పార్కులో ఓపెన్ జిమ్, గ్రూప్ సిట్టింగ్ ప్లేస్, షేడెడ్ సీటింగ్ ప్లేస్ నిర్మాణాలు జరుగుతున్నాయి. పార్కు సందర్శిం చేవారి సౌకర్యం కోసం భారీసంఖ్యలో వాహనాల పార్కింగ్ అనువుగా స్థలాన్ని కేటాయించాలని. పార్కు ఎంట్రన్స్, ఎగ్జిట్ పాయింట్ల వద్ద ఆకర్షణీయమైన ట్రీ ఫాటెన్ స్టైల్ ఆర్చి, ఇంకా రాత్రివేళ్లలో కళ్లు మిరిమిట్లు గొలిపేలా ఆర్చికి, లోపల వాకింగ్, సైక్లింగ్ ట్రాకింగ్కు కాంతి వంతమైన లైటింగ్ ఏర్పాటు చేయనున్నామని కమిషనర్ అన్నారు.
Prajavartha Online Telugu News