-గణతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలచిన రాష్ట్ర ఎన్నికల సంఘం శకటం
-త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచే లక్ష్యంతో శకట ప్రదర్శన
-2019 తదుపరి మళ్లీ 2024 గణతంత్ర్య దినోత్సవ వేడుకల్లో చోటు దక్కించుకున్న ఎన్నికల విభాగపు శకటం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో “ఓటుకు సాటి లేదు… నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను” అనే నినాదంతో ప్రదర్శింపబడిన రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క శకటం రాష్ట్ర స్థాయి గతతంత్య్ర దినోత్సవ వేడుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర స్థాయిలో 75 వ గణతంత్య్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఇందిరాగాంధీ మున్సిఫల్ స్టేడియంలో ఎంతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పలు శాఖలకు చెందిన శకటాల ప్రదర్శనలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం శకటాన్ని కూడా ప్రదర్శించారు. రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 2019 తదుపరి మళ్లీ 2024 గణతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎన్నికల విభాగపు శకటానికి చోటు దక్కింది. భారత దేశంలో అతి పెద్ద ప్రజాస్వామ్య వేడుక త్వరలో జరుగబోతుంది, ఓటు వేయడం మీ హక్కు, ఓటుకు సాటి లేదు… నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనే తదితర నినాదాలతో పాటు స్వీప్-2024 (SVEEP – Systematic Voters’ Education & Electoral Participation) కార్యక్రమాలను వివరిస్తూ భారత ఎన్నికల సంఘం లోగో, పోలింగ్ స్టేషన్, ఇ.వి.ఎం. రిప్లికాలను ప్రదర్శిస్తూ సాగిన ఎన్నికల విభాగపు శకటం ప్రజాస్వామ్య వ్యవస్థలో అవగాహనతో కూడిన ఓటు హక్కు వినియోగం రాష్ట్రాభివృద్ది గమనాన్ని, ఉజ్వల భవిష్యత్తును నిర్థేశిస్తుందని రాష్ట్ర ప్రజలకు చాటి చెప్పింది.
Prajavartha Online Telugu News