Breaking News

ఎస్సీ ఎస్టీ ల మీద దాడులను అరికట్టాలి

-కేసును తప్పు ద్రోవ పట్టిస్తున్న అధికారులపై మండిపడ్డ రవీంద్ర

కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
రెండు సంవత్సరాల క్రితం ఇబ్రహీంపట్నం కొత్త గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కొండపల్లికి చెందిన ఎంవీ షర్మిల, మాచర్ల రవీంద్ర కుమారుడు స్టాలిన్ మృతి చెందాడు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తమకు న్యాయం జరగలేదంటూ తమ ఆవేదాన్ని వ్యక్తపరిచాడు. తన కుమారుడికి జరిగినట్టుగా మరో ఎవరికీ జరగకూడదని, న్యాయం కోసం రోడ్డుపై నిరసన చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు, న్యాయం గెలవాలంటూ అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ ఏమాత్రం ఫలితం లేదని, ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయని, ఎక్కడినుండో వలస వచ్చిన కార్మికులకు అండదండగా ఉంటూ స్థానిక నాయకులు వారికి కొమ్ముకాస్తున్నారని తీవ్రస్థాయిలో మాజీ మంత్రి దేవినేని ఉమా పై మాచర్ల . రవీంద్ర ఇరుచుకుపడ్డారు. తన కుమారుడి చావుకి కారణమైన వ్యక్తులకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర కుమ్ముకాస్తూ తమకు అన్యాయం చేశారంటూ, తీవ్ర మనస్థాపానికి గురవుతూ తమ ఆవేదాన్ని మీడియాకు వ్యక్తపరిచారు. బోయ ఎన్నికలలో కచ్చితంగా బుద్ధి, మాజీ మంత్రి దేని ఉమామహేశ్వరరావు వచ్చే ఎన్నికలలో ఓడించి సరైన బుద్ధి చెప్తావని ఎమ్మెస్ షర్మిల అన్నారు. వచ్చే ఎన్నికలలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారు తగిన బుద్ధి చెప్పటం ఖాయమని, ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారని, నీ ఓటమికి ఎంత దూరమైనా ప్రయాణిస్తానని, త్వరలో మైలవరం నియోజకవర్గంలో కూడా పాదయాత్ర చేపడుతున్నట్లు షర్మిల తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *