Breaking News

వర్తక వ్యాపార సంస్థలకు లైసెన్స్‌ తప్పనిసరి..

-ఈనెల 29 తేది లోపు వ్యాపార సంస్థలు లైసెన్స్‌ పొందాలి..
-ఉపకార్మిక కమిషనర్‌ సిహెచ్‌ ఆషారాణి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
లైసెన్స్‌ లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఉపకార్మిక కమిషనర్‌ సిహెచ్‌ ఆషారాణి హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్‌ దుకాణాలు, సంస్థల చట్టం 1988 కింద వ్యాపార సంస్థలు తప్పనిసరి లైసెన్స్‌పై శుక్రవారం నగరంలోని సూర్యారావు పేట ఉపకార్మిక కమిషనర్‌ వారి కార్యాలయంలో వ్యాపార సంస్థలు, దుకాణాలకు తప్పనిసరి లైసెన్స్‌ పై వర్తక యాజమాన్య సంఘాలతో ఉపకార్మిక కమిషనర్‌ సిహెచ్‌ ఆషారాణి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మిక కమీషనర్‌ ఆదేశాల మేరకు నగరంలోని వ్యాపార సంస్థలు, దుకాణాల యాజమాన్య సంఘాలతో తప్పనిసరి లైసెన్స్‌ పై అవగాహన కల్పించాలని ఆదేశించారన్నారు. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ దుకాణాలు, సంస్థల చట్టం 1988 కింద వ్యాపార సంస్థలు తప్పనిసరిగా లైసెన్స్‌ కలిగి ఉండాలన్నారు. దీనిలో భాగంగా కార్మిక చట్ట ప్రకారం లైసెన్స్‌ లేకుండా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే వారిపై ౖ కార్మిక చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఆదేశించారు. ఈనెల 29తేది లోగా వ్యాపార సంస్థలు / దుకాణాల యాజమాన్యాలు రిజిస్ట్రేషన్‌/ లైసెన్స్‌ తప్పనిసరిగా పొందాలని ఉపకార్మిక కమిషనర్‌ సిహెచ్‌ ఆషారాణి అన్నారు.
సమావేశంలో ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షులు కె. విద్యాధరరావ్‌, ఫర్నీచర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఇ. ధామోదర్‌రావు, సత్యనారాయణపురం వర్తక సంఘం సెక్రటరీ ఎన్‌ గోపాల కృష్ణ, కార్మిక శాఖ అధికారులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *