Breaking News

ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌ణాళికాయుతంగా ఏర్పాట్లు

– జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
త్వర‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సీఈవో మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ప్ర‌ణాళికాయుతంగా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు జిల్లా కలెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. శుక్ర‌వారం రాష్ట్ర స‌చివాల‌యం నుంచి చీఫ్ ఎల‌క్టోర‌ల్ ఆఫీస‌ర్ ముఖేష్ కుమార్ మీనా ఎన్నిక‌ల స‌న్న‌ద్ధ‌త కార్య‌క‌లాపాల‌పై అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ వీసీకి క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌య స‌మావేశ మందిరం నుంచి క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు, జాయింట్ క‌లెక్ట‌ర్ డా. పి.సంప‌త్ కుమార్‌, విజ‌య‌వాడ మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్‌, విజ‌య‌వాడ ఆర్‌డీవో బీహెచ్ భ‌వానీ శంక‌ర్‌, డీఆర్‌వో వి.శ్రీనివాస‌రావు, డిప్యూటీ క‌లెక్ట‌ర్ కిర‌ణ్మ‌యి త‌దిత‌రుల‌తో క‌లిసి హాజ‌ర‌య్యారు. స్వేచ్ఛ‌గా, నిష్ప‌క్ష‌పాతంగా ఎన్నికల నిర్వ‌హ‌ణ‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, ఓట‌ర్ల తుది జాబితా ప్ర‌చుర‌ణ అనంత‌రం వివిధ ఫారాల ప‌రిష్కారం, అర్హులైన వారిని ఓట‌ర్లుగా న‌మోదు, పోలింగ్ స్టేష‌న్లు-క‌నీస వ‌స‌తుల క‌ల్ప‌న‌, పోలింగ్ సిబ్బంది నియామ‌కం, శిక్ష‌ణ త‌దిత‌ర అంశాల‌పై సీఈవో వివిధ సూచ‌న‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి జిల్లాలోని స‌న్న‌ద్ధ‌తా కార్య‌క‌లాపాల‌ను క‌లెక్ట‌ర్ డిల్లీరావు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా వివ‌రించారు. క్షేత్ర‌స్థాయి అధికారుల‌తో ప‌టిష్ట స‌మ‌న్వ‌యంతో ప్ర‌ణాళిక ప్ర‌కారం ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలిపారు. మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా వివిధ ఫారాల ప‌రిష్కారంపై చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. జ‌న‌వ‌రి 24, 27, 30 తేదీల్లో అసెంబ్లీ స్థాయి మాస్ట‌ర్ ట్రైన‌ర్ల (ఏఎల్ఎంటీ)కు శిక్ష‌ణ ఇచ్చిన‌ట్లు తెలిపారు. పోల్‌, ఎంసీసీ, ఐటీ అప్లికేష‌న్స్ త‌దిత‌ర అంశాల‌పై శిక్ష‌ణ ఇవ్వ‌డం జ‌రిగింద‌ని క‌లెక్ట‌ర్ డిల్లీరావు తెలిపారు.
స‌మావేశంలో ఎల‌క్ష‌న్ సెల్ సూప‌రింటెండెంట్ సీహెచ్ దుర్గాప్ర‌సాద్‌, ఎల‌క్ష‌న్ సెల్ సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *