గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రజాహితం.. జీవిత చరిత్రలు సమగ్ర పరిశీలన’ అంశంపై పూర్వ అధ్యాపకురాలు మరియు ప్రస్తుత తెలుగు అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి ఇటీవల ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ డిగ్రీని పొందడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరు పెన్షనర్స్ అసోసియేషన్ ఆడిటోరియంలో ”జీవిత సాఫల్య పురస్కారం అవార్డు” ఇచ్చి ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి నీ సీనియర్ పాత్రికేయులు నిమ్మ రాజు చలపతిరావు మరియు పబ్బరాజు నాగేశ్వరావు, కె.వి.ఆర్.కె శర్మ, అభినందించడం జరిగింది.
Prajavartha Online Telugu News