Breaking News

త్వరలో అందుబాటులోకి రానున్న మధురానగర్ లో నిర్మిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ నియోజకవర్గం మధురానగర్ లో నిర్మిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులను శనివారం సాయంత్రం సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు మల్లాది విష్ణు, ఇన్చార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, ప్రజలకు ఎటువంటి ఇబ్బందిగా కలగకుండా త్వరలో రైల్వే అండర్ బ్రిడ్జి అందుబాటులోకి తీసుకొస్తారని అందుకు రైల్వే శాఖ సమన్వయంతో త్వరగా పనులు పూర్తి చేస్తున్నారని, రైల్వే గేట్ వల్ల ప్రజలకు ఇక మీద సమయం వృధా చేసుకోవాల్సిన అవసరం ఉండదని, ఈనెల ఆఖరిలోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు.

ఈ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ రాకపోకలకు ఎటువంటి ఇబ్బందికి కలకుండా ఈనెల ఆఖరిలోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని, కనకదుర్గ వారధి వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా డైరెక్ట్ గా వెళ్ళే అవకాశం ద్వారా కలుగుతుందని, రైల్వే అండర్ బ్రిడ్జి ద్వారా ప్రజలకు ఎంతో ఉపయోగం కలుగుతుందని అన్నారు.

ఈ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గం ఇంచార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రయాణికులకు స్థానికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు యుద్ధ ప్రాతి పదికన జరుగుతున్నాయని, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే విజయవాడకు న్యాయం జరిగిందని, అందుకు నిదర్శనం తూర్పులో రిటైనింగ్ వాల్స్ అని అన్నారు. ప్రజల రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అతి త్వరలో రైల్వే అండర్ బ్రిడ్జి అందుబాటులోకి తీసుకొస్తామని ఫిబ్రవరి నెల ఆఖరిలోగా పనులను పూర్తి చేయనున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా నగర కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ మధురానగర్ లో నిర్మిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జి ఎంతో కీలకమైన ప్రదేశమని, ముఖ్యంగా 28, 29, 31 వ డివిజన్ల ప్రజల ఇబ్బందుల దూరం చేసేందుకు ఈ ప్రాజెక్టుని ఫిబ్రవరి నెలలోగా పూర్తి చేయనున్నారని, రైల్వే గేట్ పడటంతో ప్రయాణికులు కనీసం అరగంట నుండి గంట సమయం వరకు అక్కడ వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని, ప్రజల అసౌకర్యాని దూరం చేసేందుకు రాత్రింబగలు నిర్మాణ పనులు జరుగుతున్నాయని, మధురానగర్ స్థానికుల ఇబ్బందులు దూరం చేసేందుకే రైల్వే అండర్ బ్రిడ్జి ఒక మంచి ప్రాజెక్టు అని, రైల్వే శాఖ సమన్వయంతో విజయవాడ నగరపాలక సంస్థ పనులు త్వరతి గతిన పూర్తి చేస్తుందని అన్నారు

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవతు శైలజ, స్థానిక కార్పొరేటర్లు, చీఫ్ ఇంజనీర్ ఎం ప్రభాకర్ రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *