-పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట
-సామాజిక సృహ, దాతృత్వంల మేలు కలయికగా కార్యక్రమం
-నాటి ఉపాద్యాయిలు రామారావు, ప్రేమలతలకు ఘనంగా సన్మానం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉత్సాహ భరిత వాతావరణంలో వారంతా ఒక్కటయ్యారు. కొంచెం అటు ఇటుగా ప్రస్తుతం వారి వయస్సు యాభై . కాని పదిహేను సంవత్సరాల ప్రాయానికి వెళ్లి పోయారు. సందడి చేసారు. ఆడి పాడారు. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రు ఈదర శోభనాద్రి చౌదరి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 1987 సంవత్సరంలో పదవతరగతి పూర్తి చేసిన వారంతా శనివారం గ్రామం వేదికగా రీయూనియన్ అయ్యారు. వారి ఈ కలయిక మరో వసంతం గుర్తుండి పోయేలా అన్ని ఏర్పాట్లు చేసారు. విందు, వినోదం, సామాజిక సృహ, దాతృత్వం ఇలా అన్ని అంశాలకు సమ ప్రాధన్యతను ఇస్తూ 37 సంవత్సరాల క్రితం తమకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయలు చళ్లగుళ్ల రామారావు, కళ్యాణపు ప్రేమలత లను ఘనంగా సత్కరించారు. నాటి చిత్రాలలో ప్రత్యేకంగా రూపొందించిన మెమొంటోలను బహుకరించి అశీర్వాదం తీసుకున్నారు. పాఠశాల సమయాలకు ఇబ్బంది కలగకుండా సాయంత్రం వరకు కార్యక్రమాన్ని అన్విత గ్రూపు డైరెక్టర్ బొప్పన నాగభూషణం నివాసంలో నిర్వహించారు. పదవ తరగతినాటి మధుర ఘట్టాలను నెమరు వేసుకోవటంతో పాటు, ఈ ముఫై ఏడు సంవత్సరాలలో వారు ఎదిగిన క్రమం, జీవితంలో ఎదురైన ఆటుపోట్లు, విజయాలు, ఉన్నత పదవులు పరస్పరం పంచుకున్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే కలవాలని స్నేహ మాధుర్యాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నారు
సాయంత్రం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు చేరుకుని, అక్కడి ఈదర శోభనాధ్రి చౌదరి కాంశ్య విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. పాఠశాల ఆవరణలో తమ కలయికకు గుర్తుగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ పట్ల తమకున్న సానుకూల దృక్పధాన్ని చాటుకున్నారు. చిన్నారులతో మాటా మంతి కలిపారు. తాము అభ్యసించి ఎదిగిన క్రమాన్ని, మంచి విద్య ఆవశ్యకతను ప్రస్తుత విద్యార్ధులకు ఉద్బోదించారు. విద్యార్దుల మొదలు ఉపాధ్యాయిల వరకు ప్రతి ఒక్కరికీ ఉచిత రీతిన బహుమతులు అందించి ప్రత్యేకత చాటు కున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయిని శాంత కుమారిని సన్మానించి, తమ గ్రామ విద్యార్ధులు ఉన్నత స్దానాలకు ఎదిగేలా మంచి బోధన అందించాలని కోరారు. అయా తరగతులలో అగ్రశ్రేణిలో నిలిచిన విద్యార్ధులను ప్రోత్సహించే క్రమంలో ప్రతి సంవత్సరం బహుమతులు ఇచ్చేలా కార్పస్ ఫండ్ కావాలన్న ఉపాధ్యాయిల అంకాక్ష మేరకు బొప్పన నాగభూషణం తగిన ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మిగిలిన వారు కూడా తమ దాతృత్వం సద్వినియోగం అవుతుందనుకుంటే పాఠశాల అవసరాలు తీర్చేందుకు సిద్దంగానే ఉన్నామని ప్రకటించారు. కార్యక్రమంలో సీతారామయ్య, బి. శ్రీనివాస్, నాగేంద్రబాబు, రామ్మోహన్, వేణుగోపాల్, సంకురాత్రి శ్రీను, తాళ్లూరి వెంకటేశ్వరరావు, జగన్నాధం, డింకి బాబు, ప్రభాకర్, పుల్లయ్య, వీర్ల నాగభూషణం, బొప్పన రవికుమార్, నాగలక్ష్మి, బొప్పన పద్మ, లక్ష్మి రాణి, అనంత లక్ష్మి, ఉమ, రమ, ఉష, లక్ష్మి కుమారి, శ్రీదేవి, కమల, రంగనాయకమ్మ, దేవకీ దేవి, గొర్ల పద్మ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News