Breaking News

త్రాగునీటి సరఫరాని క్లోరిన్ శ్యాంపిల్స్ పరిశీలించి ప్రజలకు అందించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో త్రాగునీటి సరఫరాని పిన్ పాయింట్ గా క్లోరిన్ శ్యాంపిల్స్ పరిశీలించి ప్రజలకు అందించాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఆదివారం నగర పాలక సంస్థ పరిధిలో శారదాకాలనీ, వసంతరాయపురం, శ్రీనగర్ లో త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, ప్రత్యేక బృందాలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తీ చేకూరితో కలసి పరిశీలించారు. శారదాకాలనీ రిజర్వయర్ నుంచి సరఫరా చేస్తున్న త్రాగునీటికి నిర్వహిస్తున్న క్లోరిన్ పరీక్షలను పరిశీలించారు. శారదాకాలనీ 21వ లైను మార్జిన్ ప్రాంతంలో, శ్రీనగర్ ఏడవలైనులో లో వైద్యారోగ్య శాఖ సిబ్బంది నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను, పారిశుద్ధ్యం పనులను పరిశీలించారు. వసంతరాయపురం మెయిన్ రోడ్డులో వాల్ పిట్ శుబ్రత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి అధికారులతో మాట్లాడుతూ ప్రజలకు సరఫరా చేస్తున్న త్రాగునీటిని అన్ని ప్రాంతాల్లో శాంపిల్స్ తీసి పరీక్షలు నిర్వహించాలన్నారు. పరీక్ష ఫలితాల వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలని, నిర్దేశించిన విధంగా ఫలితాలు లేకపోతే వెంటనే సంబంధిత అధికారుల దష్టికి తీసుకువచ్చి చర్యలు తీసుకోవాలన్నారు. పైపులైను వాల్ పిట్ వద్ద నీరు నిల్వ ఉండ కుండా చర్యలు తీసుకోవాలని, వాల్ పిట్ లో ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తీసివేసి శుభ్రంగా ఉంచాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. త్రాగునీటి పైప్ లైన్ల పై గుర్తించిన లీకులను యుద్దప్రాతిపదికన మరమత్తు చేయాలన్నారు. మంచినీటి పైపులైను మరమ్మత్తు పనుల కారణంగా త్రాగునీటి సరఫరా నిలిపివేత, పునరుద్ధరణ పై ప్రజలకు పూర్తి స్థాయిలో ముందస్తుగా తెలియచేయాలని, ప్రత్యమ్నాయంగా ప్రజలకు అవసరం మేరకు ట్యాంకుల ద్వారా త్రాగునీటిని సరఫరా చేయాలన్నారు. శారదాకాలనీలో ఇటీవల వాంతులు, విరోచనాలు లక్షణాలతో చికిత్స చేయించుకున్న వారి వివరాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ప్రత్యేక బృందాలు ఇంటింటికి సర్వేకి వెళ్ళినప్పుడు గతంలో అనారోగ్యనికి గురై ఆరోగ్యం మెరుగుపడి ఇంటికి వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకోవాలని, వారి కుటుంబసభ్యులకు ముందస్తు జాగ్రత్త చర్యలపై అవగాహన కల్పించాలన్నారు. అనారోగ్య లక్షణాలు ఉన్న వారిని ప్రాధమిక దశలోనే సమీపంలోని ప్రత్యేక మెడికల్ క్యాంప్ లేదా, ప్రాధమిక ఆరోగ్య కేంద్రంను సంప్రదించి వైద్యసేవలు పొందాలని పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. నివాస ప్రాంతాల్లో శుభకార్యాలు, ఇతర కార్యక్రమాల సందర్భంగా ఏర్పాటు చేసిన బోజనాలు వద్ద అందించే త్రాగునీటిని వైద్యారోగ్య, మున్సిపల్ శాఖ అధికారలు పరిశీలించి వారికి అవసరమైన సూచనలు అందించాలన్నారు. శ్రీనగర్ ఏడవ లైనులో స్థానికంగా ఉన్న వాటర్ ప్లాంట్ నిర్వహణ సక్రమంగా లేదని స్థానికులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వాటర్ ప్లాంట్ ను తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని ఫుడ్ కంట్రోలర్, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ప్రజలు త్రాగునీటి పై ఏ సమస్య ఉన్నా గుంటూరు నగరపాలక సంస్థ కంట్రోల్ రూమ్ 90000 02109 నంబర్ కి కాల్ చేస్తే తగు చర్యలు తీసుకుంటారని తెలిపారు. అవసరమైన ప్రాంతాలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని అందించడానికి ట్యాంకర్లను అందుబాటులో ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ కు కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా. విజయలక్ష్మీ, నగరపాలక సంస్థ ఎస్ఈ సుందరరామిరెడ్డి, సీఎంహెచ్ఓ డా. ఆషా ఎంహెచ్ఓ మదుసూదన్, తూర్పునియోజకవర్గ తహశీల్దారు నగేష్, వైద్యారోగ్యశాఖ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *