Breaking News

ప్రభుత్వ ఉత్తర్వు ల మేరకు ప్రతీ నెల మూడో సోమవారం ఎస్పీ, కలెక్టర్ కలిసి స్పందన

-అందులో భాగంగా ఫిబ్రవరి 19 న ఎస్పీ తో జిల్లా కలెక్టరేట్లో  ప్రత్యేక స్పందన
-కలెక్టర్ డా కే.మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సోమవారం నిర్వహించే  స్పందన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఫిబ్రవరి 19 వ తేదీ సోమవారం  జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి. జగదీష్ తో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10.30 నుంచి మ.1.00 వరకు ప్రజల నుంచి అర్జిలను స్వీకరించడం జరుగు తుందన్నారు. రాజమహేంద్రవరం లోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఎస్పి పి. జగదీష్ తో కలిసి  అర్జీలను ప్రజల నుంచి స్వీకరిస్తామన్నారు.   ప్రతి నెల 3 వ సోమవారం కలెక్టర్, ఎస్పీ లు  కలెక్టరేట్ కు హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరుగుతొందని ఆమె తెలిపారు.

సోమవారం క్షేత్ర స్థాయి లో డివిజన్, మండల, గ్రామ  సచివాలయ స్థాయి స్పందన కార్యక్రమం యధావిధిగా  జరుగుతుందని కలెక్టర్  తెలిపారు. అదే విధంగా  సంబంధిత డివిజన్, మండల స్థాయి అధికారులు అందరూ ఒకే చోట ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలను స్వీకరిస్తారని కలెక్టర్ తెలియ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *