Breaking News

కోరుకొండ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ సాకారం

-కోరుకొండలో అగ్నిమాపక కేంద్రం ప్రారంభోత్సవం..
-80 లక్షల రూపాయలతో అగ్నిమాపక కేంద్రం నిర్మాణం…
-సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేసిన ఎమ్మెల్యే రాజా…
-ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న హోం మినిస్టర్ తానేటి వనిత, మంత్రి వేణు గోపాలకృష్ణ , ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో అవసరమైన చోట అగ్నిమాపక కేంద్రాలు నిర్మించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు శ్రీమతి తానేటి వనిత పేర్కొన్నారు.

ఆదివారం నాడు కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కృషి ఫలితంగా నూతనంగా నిర్మించిన అగ్నిమాపక కేంద్రాన్ని మంత్రులు తానేటి వనిత చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా తానేటి వనిత మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే కాకుండా భూకంపాలు సైక్లోన్లు వంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొనే విధంగా ఈ అగ్ని మాపక సిబ్బంది తమ సర్వీస్ ల అందిస్తారన్నారు.

కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో నూతన అగ్నిమాపక కేంద్రంలో మొత్తం 19 మంది సిబ్బంది పని చేస్తున్నారని 17 మేజర్ గ్రామపంచాయతీలకు అగ్నిమాపక కేంద్రాలు తమ యొక్క సర్వీసులు అందిస్తాయన్నారు.

రానున్నది వేసవికాలం దృశ్య అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరిగే ఆస్కారం ఉన్న నేపథ్యంలో నేడు నూతన అగ్నిమాపక కేంద్రం ప్రారంభించుకోవడం హర్షించదగిన విషయం అన్నారు.

దేశ సరిహద్దులలో ఏ విధంగా అయితే జవానులు నిరంతరం దేశానికి సేవలందిస్తారో అదే మాదిరిగా పోలీస్ వ్యవస్థతో అగ్నిమాపక వ్యవస్థ పాటు పలు వ్యవస్థలు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవిని ఆమె పేర్కొన్నారు.

ఈ అగ్నిమాపక కేంద్రం భవనం 80 లక్షల రూపాయలతో నిర్మించడం జరిగిందని మొత్తం 2.5 కోట్ల రూపాయలతో అగ్నిమాపక కేంద్రానికి అవసరమైన వాటిని సమకూర్చడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కోరుకొండ ప్రజల చిరకాల వాంఛ నేటితో సహకారం అయిందన్నారు.

కోరుకొండ పరిసరాల ప్రాంతంలో ఏదైనా అగ్నిప్రమాదం సంభవిస్తే రాజమహేంద్రవరం నుంచి ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలు ఆర్పే లోపులోనే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయేదని,అనేకమంది నిరాశ్రయులు అయ్యారని ఈ సమస్యకు పరిష్కారం చూపాలన్న లక్ష్యంతోనే ఈ ప్రాంతంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

నియోజవర్గ ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి నేడు మా హయాంలో జరిగిందని చెప్పడానికి ఎంతో గర్వంగా ఉందన్నారు.

గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాముఖ్యత ఇస్తున్నామని మన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కోట్లాది రూపాయలు గ్రామాల అభివృద్ధి కోసం వెచ్చించడం జరుగుతుందన్నారు.

గతంలో ఇచ్చిన మాటకు అనుగుణంగా నేడు కోరుకొండలో అగ్నిమాపక కేంద్రాన్ని నిర్మించామన్నారు.

కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి రాజగోపురం నిర్మాణనికి సంబంధించి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుండి అనుమతులు రావాల్సి ఉందని,వచ్చిన వెంటనే ఆ పనులకు శ్రీకారం చుడతామన్నారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన సహకారంతోనే వలనే ఇది సాధ్యమైందని ప్రజల పక్షాన సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అగ్నిమాపక సిబ్బంది వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *