Breaking News

నిర్ధిష్ట అభ్యసన వైకల్యం (స్పెసిఫిక్ లెర్నింగ్ డిజిబిలిటీ) కోసం ఛేంజ్ఇంక్ సంస్థతో ఒప్పందం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సహిత విద్యలో భాగంగా ఆర్పీడబ్ల్యూడీ (రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్) – 2016 ప్రకారం 21 రకాల వైకల్యాలను గుర్తించి ప్రత్యేక అవసరాల గల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖామాత్యులు బొత్స సత్యనారాయణ అన్నారు. పిల్లల్లో వైకల్యాలను గుర్తించడానికి కష్టతరమైన నిర్ధిష్ట అభ్యసన వైకల్యం (స్పెసిఫిక్ లెర్నింగ్ డిజిబిలిటీ) కోసం ‘ఛేంజ్ఇంక్’ (changeinkk)సంస్థతో ఒప్పందం గురువారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖామాత్యులు బొత్స సత్యనారాయణ సమక్షంలో మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ శోభిక ఎస్.ఎస్. (IAS), ‘ఛేంజ్ఇంక్’ సంస్థ ప్రతినిధి పూర్ణిత నంబియార్ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నారు. ఈ సంస్థ స్పెసిఫిక్ లెర్నింగ్ డిజిబిలిటీ విద్యార్థులను అకడమిక్ పరంగా వారిని ముందుకు తీసుకెళ్లడం కోసం చేయాల్సిన విధానాలను రూపొందించడం, వారి కోసం కృషి చేయనున్నారు. ఈ సంస్థ స్వచ్ఛందంగా సేవలందించనుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ (IAS), స్టీరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *