Breaking News

అభివృద్ధిలో ముందున్న విజయవాడ

-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అభివృద్ధిలో విజయవాడ ముందడుగులో ఉందని విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి గురువారం ఉదయం 41, 42, 43వ డివిజన్లోని వెంకటేశ్వర ఫౌండ్రీ రోడ్నకు బి టి రోడ్ నిర్మాణం మరియు పేపర్ బాక్స్ వేయుటకు శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో అన్నారు.

పశ్చిమ నియోజకవర్గం పరిధిలో గల 41 42 43వ డివిజన్లోని వెంకటేశ్వర ఫౌండ్రీ రోడ్డునకు బిటి రోడ్డు నిర్మాణము మరియు పేవర్ బ్లాక్స్ వేయుటకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి. ఈ సందర్భంగా మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం నిధులతో మూడు కోట్ల ఐదు లక్షల రూపాయల అంచనా విలువ అయినా బీటీ రోడ్ మరియు పేపర్ బ్లాక్ వేయుటకు కేవలం శంకుస్థాపన శిలాఫలకాలతోనే కాదు ప్రారంభోత్సవం కూడా చేస్తారని అన్నారు. 900 మీటర్ల పొడవైన కాలుష్య రహితమైన డస్ట్ ఫ్రీ రోడ్స్ వేస్తున్నట్లు తెలిపారు. విజయవాడలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలోనే కనీ విని జరుగునంత అభివృద్ధి కేవలం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే జరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ షేక్ ఆసిఫ్, 41వ డివిజన్ కార్పొరేటర్ మొహమ్మద్ ఇర్ఫాన్, 42వ డివిజన్ కార్పొరేటర్ పడిగపాటి చైతన్య రెడ్డి,వఫ్క్ బోర్డ్ ప్రెసిడెంట్ గౌస్ మొహిద్దిన్ , తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *